Site icon NTV Telugu

Easy & Healthy Paneer Tikka Chapati: పిల్లలకి చపాతీ రోల్ ఇలా చేసి పెట్టారంటే రోజూ ఇదే కావాలంటారు..

Paneer Tikka Roll

Paneer Tikka Roll

Easy & Healthy Paneer Tikka Chapati: వంట గది నుంచి వచ్చే ఆ ఘుమఘుమలు ఊరిస్తుంటే.. ఆకలి దానంతట అదే పెరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు ఏదైనా కొత్తగా, రుచిగా చేసి పెట్టాలనుకునే తల్లులకు ‘పన్నీర్ టిక్కా రోల్’ ఒక అద్భుతమైన ఎంపిక. బయట దొరికే ఫ్రాంకీల కంటే మిన్నగా, పూర్తి ఆరోగ్యకరంగా ఇంట్లోనే దీనిని ఎలా సిద్ధం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: MSVP OTT Release: జీ5లోకి మెగా విక్టరీ.. మెగాస్టార్ ‘ఓటీటీ’ ఊచకోతకు డేట్ లాక్ చేసుకోండి!

‘పన్నీర్ టిక్కా రోల్’కి కావలసిన పదార్థాలు..
గోధుమపిండి (1 కప్పు), పెరుగు (పావు కప్పు), ఉప్పు, నూనె, పన్నీర్ (200 గ్రా.), పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, వెన్న (బటర్), క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, మయోన్నైస్, టమాటా కెచప్.

తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో ఉప్పు, కొద్దిగా నూనె, పావు కప్పు పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల చపాతీలు ఎంతో మెత్తగా వస్తాయి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకుని, 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం చపాతీల్లా ఒత్తుకుని, పెనంపై నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి హాట్ బాక్స్‌లో ఉంచుకోవాలి. అనంతరం పన్నీర్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కార్న్ ఫ్లోర్ పట్టించి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పంచదార, నెయ్యి వేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలను హై ఫ్లేమ్‌లో లైట్‌గా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో వెన్న వేసి పన్నీర్ ముక్కలను దోరగా వేయించాలి. ఆపై మసాలా కలిపిన పెరుగు మిశ్రమాన్ని వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు, వేయించిన పన్నీర్ వేసి కలపాలి.

రెస్టారెంట్ రుచి రావాలంటే.. కాల్చిన బొగ్గును ఒక చిన్న గిన్నెలో ఉంచి, ఆ గిన్నెను పన్నీర్ మిశ్రమం మధ్యలో పెట్టాలి. బొగ్గుపై కొంచెం నూనె లేదా వెన్న వేసి వెంటనే మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ఆ పొగ వాసన పన్నీర్‌కు పట్టి అద్భుతమైన రుచినిస్తుంది. కాల్చిన చపాతీపై అప్పుడే తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఉంచి, దానిపై పచ్చి ఉల్లిపాయలు, మయోన్నైస్, టమాటా కెచప్, కొంచెం నిమ్మరసం చల్లి రోల్ చేయాలి. అంతే! వేడివేడి పన్నీర్ టిక్కా రోల్ సిద్ధం అవుతుంది. మైదా వాడకుండా కేవలం గోధుమపిండితో చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.

READ ALSO: Tragic Incident: అన్నం పెట్టే చెట్టుపైనే.. కల్లు గీయడానికి వెళ్లి గీత కార్మికుడు మృతి..

Exit mobile version