NTV Telugu Site icon

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్‌.. 80 శాతం భారీ డిస్కౌంట్స్‌..

Flipcard Got Sacles

Flipcard Got Sacles

Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ సేల్‌కు సిద్ధమవుతోంది. Flipkart GOAT అనే సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్‌లను అందించనున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఈనెల జూలై చివరిని నుంచి ఆగస్టు వరకు ఉంటుందని టాక్.. సేల్‌లో భాగంగా iPhone 15పై తగ్గింపు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ టీవీలపై 80 భాట్ వరకు తగ్గింపు అందించబడుతుంది. ఇవి కాకుండా టీవీలు, వాషింగ్ మెషిన్, ఆర్‌ఓ, ప్రింటర్, మిక్సర్ తదితరాలపై 80% వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. మీరు ఐఫోన్ ప్రియులైతే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఐఫోన్ 14 ప్లస్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 23,901 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

Read also: Health Tips: నిజమా..! పసుపు నీరు తాగితే బరువు తగ్గుతారా? ట్రై చేయండి..

ఈ బెస్ట్ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం..

భారతదేశంలో Apple iPhone 14 Plus బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,990. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 55,999 కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా మీరు ఎంచుకున్న బ్యాంకు కార్డులను ఉపయోగిస్తే మీకు రూ. 1,000 తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాత ఫోన్‌ను రూ. 48,000 మర్పు పొంది వాల్యూ పొందవచ్చు. కాగా, ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కొత్త సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. Flipkart మొబైల్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్ మరియు DTH రీఛార్జ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో బిల్లు చెల్లింపులను చేయవచ్చు. UPI సేవలతో పాటు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల సహాయంతో బిల్లు చెల్లింపులు చేయవచ్చు.
CM Revanth Reddy: నేడు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యంతో సీఎం రేవంత్ భేటీ..

Show comments