నాన్‌వెజ్ భోజనం చేయడం వల్ల లాభాలున్నాయా అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందడానికి తప్పనిసరిగా మాంసాహారం తినాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాఖాహారంతో కూడా శరీరానికి కావాల్సినంత ప్రోటీన్‌ను సమృద్ధిగా పొందవచ్చని వారు సూచిస్తున్నారు. పప్పులు, శెనగలు, సోయాబీన్, పాల ఉత్పత్తులు, గింజలు వంటి శాకాహార పదార్థాల్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది.
మాంసాహార వంటకాలను మానేసిన తర్వాత శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడటం, చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గడం, బరువు నియంత్రణలో ఉండటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మాంసాహారం తీసుకునేటప్పుడు చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ శాఖాహారం తీసుకోవడం వల్ల అలాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శాకాహారం వల్ల మనస్సు తేలికగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో జీవనశైలి మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల తగ్గి, మెరుగైన జీర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది. బరువు నియంత్రణలో ఉండడంతో పాటు శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. శాఖాహారం తీసుకునే వారు తమ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, కాల్షియం, జింక్ వంటి అవసరమైన పోషకాలు తగినంతగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు దీన్ని ఫాలో అయ్యే ముందు.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
