మనిషి ఇప్పుడు డబ్బు మాయలో ఉన్నాడు.. ఎంత సేపు ఎంత సంపాదించాలి.. ఎంత పొదుపు చెయ్యాలి.. అందరికన్నా రిచ్ గా ఎలా ఉండాలి అనే ఆలోచనతో డబ్బులను సంపాదించడానికి చాలా కష్టపడతాడు.. ఒకప్పుడు మనిషి కి కుటుంబం అనే ఆలోచన ఉండేది.. ఇప్పుడు డబ్బే ప్రపంచం అనేంతగా బ్రతుకుతున్ననాడు.. దీంతో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసాడు.. అందుకే 60 లో రావాలసిన జబ్బులు అన్నీ 30 లోనే వస్తున్నాయి.. అంతే కాదు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను సైతం ఎదుర్కొంటున్నారు. దీనంతటి కీ కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి లో మార్పులు. ఇది లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. భార్య, భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది.
ఇక సంతాన లేమి వంటి సమస్యలకు దారి తీస్తుంది. తక్కువ స్పెర్మ్, స్పెర్మ్ నాణ్యత లేకపోవడం వంటి సమస్యలు పురుషుల్లో అధికమవుతోంది. ఈ కారణంగా వారి వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి.. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాయామాలు చెయ్యడం తప్పనిసరి.. ఇప్పుడు మనం ఐదు వ్యాయామాల గురించి తెలుసుకుందాం..
పద్మాసనం
రివర్స్ ప్లాంక్ వ్యాయామం
స్క్వాట్స్ వ్యాయామం
ఓవర్ హెడ్ స్క్వాట్ వ్యాయామం
ఫ్రంట్ ప్లాంక్ వ్యాయామం.
ఈ ఆసనాలను రోజుకు ఒక్కసారి 10 నిమిషాలు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఇంకా బరువు తగ్గడం తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.. వ్యాయామంతో పాటు ఆహారం విషయం లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిరోజూ అరటిపండు తినాలి. ఇందులో ఉండే పొటాషియం, B6 సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. సీజన్ లో దొరికే వాటిని అస్సలు మిస్ చెయ్యకుండా తినడం మంచిది.. టైం కు తినడం నిద్రపోవడం.. మనసును ప్రశాంతంగా ఉంచితే మనిషి చాలా కాలం బ్రతుకుతాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇది మర్చిపోకండి..