Site icon NTV Telugu

Illegal relationships : దాంపత్య బంధానికి పెనుభూతులవుతున్న వివాహేతర సంబంధాలు.. కారణాలు ఇవేనా..!

Untitled Design

Untitled Design

వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య నమ్మకంతో ఏర్పడిన జీవన బంధం. ఇద్దరూ కలిసి జీవిత ప్రయాణాన్ని విశ్వాస పూర్వకంగా సాగించాలన్న ఆలోచనతో ఈ బంధం మొదలవుతుంది. కానీ వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. పచ్చని సంసారంలో చిచ్చు రేపుతాయి. భాగస్వామ్యుల లో ఏ ఒక్కరు దారితప్పిన ఆ కుటుంబాలు రోడ్డున పడుతుంది. ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాల బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా నగరంలో హత్యలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ క్రమంలో కొందరు తమ జీవిత భాగస్వామిని అడ్డు తొలగించుకోవడానికి వెనుకాడడం లేదు. వయసుతో సంబంధం లేకుండా, పెళ్లయిన కొత్త దంపతుల‌కానుండి, మూడు దశాబ్దాలు కాపురం చేసిన వాళ్ల వరకు, ఈ దారిలో వెళ్తున్నారని పరిశీలనలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాల పెరుగుదలకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

1. ఆర్థిక ఒత్తిళ్లు
పిల్లలు, ఇంటి ఖర్చులు, ఉద్యోగ భద్రత లాంటి ఆర్థిక సమస్యలు దంపతుల మధ్య టెన్షన్‌కు దారితీయొచ్చు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలనే ప్రయత్నంలో కొందరు తప్పు దారి పడతారు. ఈ పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలను ఓ తాత్కాలిక పారితోషికంగా భావించే వారు ఉన్నారు. అలాగే భర్తకు భార్య ఓ ఓదార్పు..ధైర్యం ఇవ్వగలగాలి. వారి ఒత్తిడిని అర్థం చేసుకొని నిదానంగా వ్యవహరించాలి. అలాగే భర్త కూడా భర్యతో ఎంత స్ట్రేస్ ఉన్న తిన్నావా అని అడగడం, ఈ రోజు ఎలా గడిచింది అని అడగడం చేయాలి. అలాంటప్పుడు అలసట దూరం అవుతుంది బంధం కూడా గట్టిగా ఉంటుంది.

2. శారీరక, మానసిక అసంతృప్తి
జీవిత భాగస్వామితో అవసరమైన ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, శారీరకంగా సంతృప్తి లభించకపోవడం కూడా సంబంధాల బలహీనతకు కారణమవుతుంది. వివాహిత జీవితం అనేది ప్రేమ, నమ్మకం, గౌరవం, శారీరక, మానసిక అనుబంధాల సమ్మేళనం. అయితే కొన్ని సందర్భాల్లో భాగస్వామితో మనసులోని భావాలను పంచుకోలేకపోవడం, సమయాభావం, కలిసినప్పుడు ఆసక్తి చూపకపోవడం వల్ల సన్నిహితత తగ్గిపోతుంది. ఆ ఫీలింగ్స్ తీర్చుకునేందుకు మనసు ఇతరులతో అనుబంధాలకు దగ్గర చేస్తుంది. ముఖ్యంగా శారీరక అవసరాలు తీరకపోతే, అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది విడిపోవడం కాకుండా సంబంధాన్ని బలహీనంగా మారుస్తుంది. ఓ సున్నితమైన భావోద్వేగ అనుబంధం లేకపోతే, ఒంటరితనం పెరుగుతుంది. కాలక్రమంలో రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు, పిల్లల పెంపకం, ఆర్థిక బాధ్యతలు మొదలైనవి దంపతుల మధ్య ఉన్న అనుబంధాన్ని తగ్గించేస్తాయి. ఆ బలహీనతల మధ్య మానసికంగా శారీరకంగా వేరొకరికి దగ్గరవుతారు. ప్రేమ కన్నా మరింత అవసరం నమ్మకం, గౌరవం ఉన్నా అవి కాలక్రమేణా మాయమవుతుంటే, మనసు ఇతరులను ఆశ్రయించే అవకాశం పెరుగుతుంది.

3. అనుమానాలు, ప్రతీకార భావం
వివాహిత జీవితంలో నమ్మకం అన్నది పునాది లాంటిది. అది దెబ్బతిన్నప్పుడు, సంబంధం క్రమంగా బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులు వివాహేతర సంబంధాలకు దారితీస్తాయి. భార్య లేదా భర్త చిన్న విషయంలోనైనా వివరాలు చెప్పకపోవడం, మారిన ప్రవర్తన, మొబైల్/సోషల్ మీడియా లో రహస్యం గా వ్యవహరించడం వంటి కారణాలు అనుమానాలకు దారితీస్తాయి. ఒక వ్యక్తి అనుమానం కలిగితే, సంబంధంలో భద్రతా భావం పోయి నెమ్మదిగా దూరం పెరుగుతుంది. అనుమానాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం కాకుండా అంతరంగంలో ఉంచుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అందుకే అనుమానాలు మొదలైనప్పుడు నిగ్రహంగా మాట్లాడి తేల్చుకోవడం, సంబంధం పట్ల నిజాయితీగా ఉండే ప్రయత్నం, అవసరమైతే వివాహ పరామర్శకుల సహాయం తీసుకోవడం మంచిది.

4. సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా వివాహేతర సంబంధాల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది జనాల మధ్య దూరాన్ని తగ్గించినట్టే అనిపించినా, వ్యక్తిగత సంబంధాల్లో అనేక సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇది ఒక శక్తివంతమైన మార్గంగా మారింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, డేటింగ్ యాప్స్ ద్వారా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి. దీంతో చాలామంది తమ నిజమైన జీవితాన్ని కాకుండా కొత్తపరిచాయాలకు ఆకర్షితులు అవుతున్నారు. చాటింగ్ ప్రారంభంలో స్నేహంగా మొదలై ఒక అనుబంధం ఏర్పడుతుంది. దీని కారణంగా భార్య భర్తల మధ్య బంధం ముక్కలవుతుంది.

5. కొత్తదానికి కోరిక – పాతదానికి విరక్తి భావన
ఈ మధ్య ‘పండగ పూట పాత మొగుడేనా?’ లాంటి సామెతలు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది కొత్త అనుభవాల కోసం, కొత్తదనం కోసం, రొటీన్‌కు విరామంగా, అలసటను పోగొట్టే ప్రయత్నంగా వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఇంటి బాధ్యతలు.. భార్య వేధింపులు తట్టుకోలేక చాలా మంది వేరొకరికి అలవాటవుతుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా కూడా భార్య భర్తలు ఇద్దరు డే మొత్తంలో ఓ గంట సమయం వారి కోసం వారు గడపాలి.

ముగింపు:
బంధం ఎప్పుడు బలపడతుందంటే… అది పరస్పర నమ్మకం, గౌరవం, ఓపిక, పరస్పర అర్థం చేసుకోవడం పై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు నీరుగారితే.. సంబంధాలు బలహీనపడతాయి. కాబట్టి, విడిపోవడానికన్న విభేదాలను మాట్లాడుకోవడం, పరిష్కరించుకోవడం చేయండి. ఒక్కప్పుడు భర్త అంటే భార్య గౌరవంతో పాటు అంతే భయంగా కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ తరం వారిలో చలా మార్పులు వచ్చాయి. ఒక్కప్పటి తరం తిరిగి వస్తే ఈ బంధం విలువ ఏంటో తెలుస్తుంది.

Exit mobile version