Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..

  • గర్భిణిలు పైనాపిల్, బొప్పాయి తినొద్దు..
  • అందులో ఉండే రసాయనాలే కారణం..
Early Pregnancy Diet

Early Pregnancy Diet

Early Pregnancy Diet: మహిళలు గర్భం దాల్చిన తర్వాత పైనాపిల్, బొప్పాయి తినొద్దని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. వీటిని తింటే గర్భంపై ప్రభావం పడుతుందని, అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే, ఈ రెండు ఫలాలే ఎందుకు ఇలాంటి నిందలు ఎదుర్కొంటున్నాయి.? దీని వెనక కారణాలు, నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయిని తినకూడదా.?

బొప్పాయి పచ్చిగా లేదా సగం పండిన పండ్లను తొనొద్దు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇవి ప్రమాదకరంగా పరిగణిస్తారు. పరిశోధనలు, కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ రెండు రసాయనిక పదార్థాలు కూడా గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా గర్భాశయంలో సంకోచాలు పెరుగుతాయి. తద్వారా గర్భం నిలిచే సామర్థ్యాన్ని గర్భాశయం కోల్పోతుంది. అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే, పచ్చి బొప్పాయిని తినడం కన్నా పూర్తిగా పండిన బొప్పాయిని తింటే మంచిదని చెబుతుంటారు. ఇందులో విటమిన్ సి, ఫోలెట్, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. గర్భిణిలు బాగా పండిన బొప్పాయిని మితంగా తినొచ్చు.

పైనాపిల్ ఎందుకు హానికరం.?

పైనాపిల్ తిన్నా కూడా గర్భస్రావం అవుతుందనే భయాలు ఉన్నాయి. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని(సెర్విక్స్)‌ను సున్నితంగా మారుస్తుంది. తద్వారా గర్భంలోని పిండంపై ప్రభావం పడుతుంది. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తారు.