NTV Telugu Site icon

Health Tips : భోజనానికి ముందు వీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు..

Before Mels

Before Mels

ఈరోజుల్లో ఎక్కువ మంది ఫిట్ గా ఉండాలని అనుకుంటారు.. అందులో భాగంగా అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే, ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సులువుగా బరువు తగ్గుతారు.. అది కూడా భోజనానికి ముందు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

భోజనానికి ముందు సూప్ తాగడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఎందుకంటే ఈ సూప్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి.. అందుకే భోజనం ఎక్కువ తినడానికి ఆసక్తి చూపిస్తారు..

ఇకపోతే ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు, టోఫు, బీన్స్ తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.. దానివల్ల భోజనం చెయ్యరు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

అలాగే గ్రీన్ టీని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి సమ్మేళనాలు థర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. దీనివల్ల అధిక కొవ్వు కరగడానికి సహాయపడుతుంది…

ప్రోటీన్స్ ఎక్కువగా ఫుడ్ ను కూడా తీసుకోవాలి.. అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి హెల్దీ ఫ్యాట్స్‌ని తీసుకుంటే కొద్దిగా తినగానే కడుపునిండిన భావన ఉంటుంది.. దాంతో ఎక్కువ ఫుడ్ ను తీసుకోరు.. దానివల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి.. ఇలా భోజనానికి ముందు ఏదోకటి తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.