Site icon NTV Telugu

Dr.Care : ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రత్యేకం

Dr Care Homeopathy

Dr Care Homeopathy

డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు హోమియోపతి పితామహునిగా, ఒక గొప్ప వైద్య శాస్త్రవేత్తగా మరియు ఒక అద్భుతమైన చికిత్సావిధానాన్ని ప్రపంచానికి అందించిన ఒక విజ్ఞానిగా మన అందరికీ సుపరిచితం. జర్మన్ వైద్యులైనటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు అల్లోపతి వైద్య రంగంలో పట్టభద్రులుగా వైద్య విద్యను అభ్యసించిన వ్యక్తి. ఒక రోజు ఆంగ్ల పుస్తకాన్ని జర్మన్ భాషలోని అనువదించే సమయంలో సింకోనా ఆఫీసినలిస్ అనే చెట్టు యొక్క బెరడు రసాన్ని తీసుకుంటే విపరీతమైన చలి వస్తుందని, దానితో పాటుగా జ్వరం కూడా వస్తుందని తెలియచెప్పే క్రమంలో ఆ సూత్రాన్ని తనపై తానే ప్రయోగం చేసుకొని, ఆ సింకోనా బెరడు రసం తీసుకోవడం వల్ల చలి జ్వరం వస్తుందని నిర్ధారణ చేసుకుని, మాములు చలి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి, సింకోనా బెరడు యొక్క రసం ఇవ్వడం వలన ఏదైనా ఫలితం వస్తుందా అనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో ఒక రోగికి ఈ సింకోనా బెరడు రసం వలన ఒక గంట సమయంలోనే ఆ రోగి పూర్తిగా కోలుకోవడం గమనించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. అంటే ఇక్కడ ఏదో సైన్స్ ఉంది అనేది తెలుసుకొని ఒక కొత్త వైద్య విధానానికి అంకురార్పణ చేయడం జరిగింది. అలాగే చలి జ్వరంతో బాధపడుతున్న చాలామంది రోగులకు సింకోనా బెరడు రసం ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఈ విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలించి దీనిపైన పరిశోధన చేయడం వల్ల “సిమిలియా సిమిలిబస్ కురంటర్” అనే ఫార్ములాను కనుగొని దాదాపు 45 సంవత్సరాలు హోమియోపతి వైద్య విధానం పైన పరిశోధనలు చేసి, దాదాపు వంద రకాల హోమియోపతి మెడిసిన్స్న కనిపెట్టడం మూలంగా, నేటికీ డాక్టర్ హానిమన్ గారు చేపట్టిన ప్రయోగాల ఫలితాన్ని ప్రామాణికంగా తీసుకుని వాడుతున్నారు.

ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ గా గుర్తించి దానిని సైన్స్ పరంగా అభివృద్ధి చేసుకుని, ఒక గొప్ప హోమియోపతి వైద్యునిగా తనకు తాను ప్రయోగాలు చేసుకుంటూ, తన దగ్గరకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తూ 88 సంవత్సరాల వరకు జీవించి, ఒక గొప్ప వైద్య విధానాన్ని ప్రపంచానికి ఇవ్వడం మరియు భారతదేశంలో కొన్ని మిలియన్ సంఖ్యలో జనాభా హోమియోపతి వైద్యం పొంది నయం చేసుకోవడం, అందులో “డాక్టర్ కేర్ హోమియోపతి” ఒక విప్లవాత్మకమైన వైద్య సంస్థగా ఎదగడం డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారికి డాక్టర్ కేర్ వైద్యబృందం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతుంది.

ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని “ప్రపంచ హోమియోపతి దినోత్సవం”గా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనకు ఎంతో గర్విచదగ్గ విషయం. ఒకే ఒక వ్యక్తి కొన్ని మిలియన్ సంఖ్యలో రోగులకు ఆదర్శప్రాయంగా మారడం, దానికి డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు పాలుపంచుకోవడం ఈ సందర్భంగా హైదరాబాద్ నొవొటెల్ నందు డాక్టర్ కేర్ వైద్య బృందం సమావేశమై “డాక్టర్ శ్యాముల్ హానిమన్” గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏ విధమైన సైడర్ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్యాన్ని మనకు అందించడంలో డాక్టర్ శ్యామూల్ హానిమన్ గారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. హోమియోపతి అనేది దీర్ఘకాలిక జబ్బులనే కాకుండా తాత్కాలిక జబ్బులను కూడా నయం చేస్తుందని, కోవిడ్ లాంటి విపత్కర సమయంలో నిరూపితమైనది. మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో హోమియోపతి వైద్యం ముందుంటుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి CEO “డాక్టర్ సృజన పేర్ల” గారు మాట్లాడుతూ భవిష్యత్తులో హోమియోపతి వైద్య విధానం ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రతీ గడపకూ డాక్టర్ కేర్ సేవలు చేరాలని, హోమియోపతి వైద్యం ద్వారా తాత్కాలిక జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులుగా మారకుండా చూడొచ్చని దక్షిణ భారతదేశ ప్రజలందరూ డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క సేవలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని, గత 20 సంవత్సరాలుగా డాక్టర్ కేర్ వైద్య బృందం చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారికి మనమంతా ఋణపడి ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి మరియు డాక్టర్ పాజిటివ్ హోమియోపతి Founder “డాక్టర్ A.M. రెడ్డి” గారు మాట్లాడుతూ, ఇప్పుడు మనం గడుపుతున్న వేగవంతమైన జీవితంలో ఆధునిక సమాజం తమ జీవినశైలిలో మార్పులు చేసుకోవాలని, భవిష్యత్తులో వచ్చే భయంకరమైన జబ్బులనుంచి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కొవిడ్ ఒక గుణపాఠం నేర్పిందని, “Prevention is better than cure” అనే విధానాన్ని మనం పాటించాలని, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు మీ “ఫ్యామిలీ వైద్యులు” గా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని, దక్షిణ భారతదేశంలో డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క సేవలు అద్భుతంగా ఉన్నాయని వారి వైద్య బృందాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో భారతదేశం మొత్తం “డాక్టర్ కేర్ హోమియోపతి” సేవలు విస్తరించాలని, దానికి ప్రజల సహకారం, డాక్టర్ కేర్ వైద్యుల సహకారం మరియు డాక్టర్ కేర్ వైద్య సిబ్బంది యొక్క సహకారం ఎంతో ముఖ్యమని, హోమియోపతికి ఒక గర్వకారణంగా మనం ఎదగాలని తన బృందాన్ని అభినందిస్తూ, తెలుగు ప్రజలకు హోమియోపతి వైద్యుల తరపున శుభాకాంక్షలు తెలిపారు.

డా॥M.నీరజ,
మెడికల్ ఇంఛార్జ్ విభాగం
డా, కేర్ హోమియోపతి, పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్: 7675007000

Dr Care

 

https://ntvtelugu.com/pawan-kalyan-fire-on-cm-jagan-words/

Exit mobile version