Health Tips: సాధారణంగా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పాలు తాగమని సలహా ఇవ్వడం గమనించే ఉంటాం. ఎందుకంటే ఇది శారీరక పెరుగుదల, బలానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం కాబట్టి. నేటికీ కూడా.. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారుతున్నప్పటికీ, పాలు పోషకాహారానికి సులభంగా లభించే వనరుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ పాలు తాగమని సూచిస్తారు. అదే సమయంలో కాల్షియం లోపం సంబంధిత సమస్యలు ఉన్న వారికి దీనిని తీసుకోవాలని సూచిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. కాల్షియం లోపాన్ని తీర్చడానికి రోజు పాలు తాగితే సరిపోతుందా.
READ ALSO: Sanju Samson: ముంచుకొస్తున్న ముప్పు.. సంజు శాంసన్‌కు ఇదే చివరి ఛాన్స్!
నిజానికి చాలా మంది పాలు తాగితే కాల్షియం సమస్య తీరుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు నిపుణులు మాట్లాడుతూ.. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి మంచి మొత్తంలో కాల్షియం లభిస్తుందని, ఇది సులభంగా గ్రహించబడుతుందని వివరించారు. పాలలోని విటమిన్ డి శరీరంలో కాల్షియం బాగా పనిచేయడానికి సహాయపడుతుందని, అందుకే ఎముకలు, దంతాలను బలోపేతం కావడానికి పాలు చాలా చక్కగా పని చేస్తాయని తెలిపారు. అయితే కాల్షియం అవసరాలు ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటాయని, అవి వయస్సు, లింగం, జీవనశైలి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయని వివరించారు. కాల్షియం లోపం తీవ్రంగా ఉంటే, కేవలం పాలు మాత్రమే తాగడం వల్ల సమస్య తీరదని చెప్పారు. అలాంటి సందర్భాలలో పెరుగు, జున్ను, ఆకుకూరలు, నువ్వులు, బాదంపప్పులతో పాటు పాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం అని సూచించారు. ఇది శరీరానికి వివిధ వనరుల నుంచి కాల్షియంను అందిస్తుందని, మొత్తంమీద పాలు కాల్షియం లోపాన్ని తీర్చడంలో సహాయపడతాయని వెల్లడించారు. కానీ సమతుల్య ఆహారం లేకుండా ఈ లోపాన్ని పూర్తిగా తీర్చడం కష్టం అవుతుందని తెలిపారు.
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు రెండు గ్లాసుల పాలు (400 నుంచి 500 మి.లీ.) సరిపోతాయని చెబుతున్నారు. ఇది రోజువారీ కాల్షియం అవసరాన్ని తీర్చగలదు. పిల్లలు, టీనేజర్లు, గర్భిణీలు వారి అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచాల్సి రావచ్చని తెలిపారు.
కాల్షియం సమస్యను జయించడానికి వీటిని కూడా ట్రై చేయండి..
పాలు తీసుకోవడంతో పాటు, విటమిన్ డి స్థాయి కూడా సరిగ్గా ఉండాలి.
ప్రతిరోజూ కొంత సమయం ఎండలో గడపండి.
పాలు మాత్రమే కాదు, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా తీసుకోవడం తగ్గించండి.
READ ALSO: OTR: టీజీవో, టీఎనీవో మధ్య కోల్డ్ వార్? డీఏ పెంపుతో బయటపడిందా ?
