పెళ్లి అయ్యాక చాలా మంది పిల్లలకు ప్లాన్ చేస్తారు.. కానీ కొంతమంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని లేదా లైఫ్ ను ఎంజాయ్ చెయ్యాలని పిల్లలను కనడానికి పెద్దగా ఇష్టపడరు.. ఇవి మాత్రమే కాదు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
చాలా మంది దంపతులు కేరీర్ లో ఏదైన సాధించాక పిల్లలను కనాలని అనుకుంటారు.. కెరీర్‌ని చక్కగా బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే వాడాలనుకుంటున్నారు. ఈ కారణంగా పిల్లల్ని కనే ఆలోచన పోస్ట్‌పోన్ చేస్తున్నారు. పిల్లల్ని కంటే తాము అనుకున్న మార్గంలో ఎదగలేమని భావించి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకుంటారు..
ఈరోజుల్లో పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అయ్యింది.. దాంతో పిల్లలను కనాలంటే కొందరు దంపతులు పిల్లలను వద్దని అనుకుంటారు..పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా పిల్లలను వద్దని అనుకుంటారు.. సిటీలల్లో ఉన్నవాళ్లు కొందరు పిల్లలను ఇప్పట్లో కనలేము అంటున్నారు కూడా..
ఇకపోతే దంపతులు.. సంతానం లేకుండా వారు ఉన్నన్నీ రోజులు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు.. దానివల్లే పిల్లలను కనడానికి సముఖత చూపించరు..
చాలా మంది జంటలు ప్రపంచాన్ని చుట్టేయాలని వారి చుట్టూ ఉన్నవాటిని చూడాలని ఆత్రుత కనబరుస్తారు.. అలాంటి వారు కూడా పిల్లల్ని కనాలనుకోరు…. ఇవన్నీ కారణాలుగా భావించి చాలా మంది పిల్లలను కనడానికి ఇష్టపడరు..
