Site icon NTV Telugu

Jaggery-Yogurt Mix : పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Curd Jaggery

Curd Jaggery

ఎన్ని రకాల కూరలను వేసుకున్నా కూడా చివర పెరుగు వేసుకోకుండా తింటే ఏదో వెళితిగా ఉంటుంది.. కడుపు నిండిన భావన ఉండదు.. నిత్యం పెరుగును ఏదొక విధంగా తీసుకుంటాము.. పెరుగుతో వేరే వాటిని తీసుకుంటారు.. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు పెరుగులో పంచదార, ఉప్పు కలిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం కంటే పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత క్యాల్షియం లభిస్తుంది. దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పెరుగును, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పెరుగును, బెల్లాన్నికలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది..

రక్తహీనతతో బాధపడే వారు పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో ఇవి రెండు కూడా మనకు తోడ్పడుతాయి. పెరుగును, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఇతర ఆహారాల వైపు మన దృష్టి వెళ్లకుండా ఉంటుంది. అలాగే పెరుగును, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు శక్తి కూడా లభిస్తుంది. శరీరం బలంగా తయారవుతుంది. నీరసం, బలహీనత, సమస్యలు తగ్గిపోతాయి.. పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవాలనుకునే వారు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకోకూడదు. రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది..రోజుకు ఒక్కసారి తీసుకుంటే చాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version