వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటాం. వాన కాలంలో, చలికాలం అయితే వేడి వేడి గా ఏదైనా తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అలాంటి వాటిలో మొక్కజొన్న పొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న ఇష్టపడని వారుండరు వీటిని నిప్పులపై కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న లో చాలా లాభాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా వరకు మొక్కజొన్నను వలిచిన తర్వాత చెత్తగా భావించి దాని పీచును బయట పడేస్తుంటారు. కని పారేసే ఆ పీచులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
* మొక్కజొన్న పీచు లో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి2, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. కనుక దీన్ని 5000 సంవత్సరాల క్రితం అనేక అనారోగ్యాల చికిత్సలో దీన్ని వాడేవారు. అంతేకాదు మొక్కజొన్న పీచులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే యూరిన్‌లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మన శరీరంలో ఉన్న అదనపు నీరు, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
* మొక్కజొన్న పీచు ఉడికించి నీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటే, మొక్కజొన్న పీచు మరిగించి నీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.
* రక్తపోటును నియంత్రించడంలో ఈ మొక్కజొన్న పీచు నుండి తయారు చేసిన నీరు సహాయపడుతుంది. దీని తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి.
* బరువు తగ్గాలనుకునే వారు మొక్కజొన్న జుట్టు ఉడికించిన నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వినియోగం శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాటర్ రిటెన్షన్ సమస్యను నయం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు ఎలాంటి కొవ్వునైన తగ్గించడానికి సహాయపడుతుంది.
* కొంత మందికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న కూడా మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు మొక్కజొన్న జుట్టు నీరు తీసుకోవాలి. ఇందులొ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల దీని వినియోగం శరీరంలో మంట ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ శరీరంలో మంట కారణంగా, మీరు ఏకకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు. అందుకే రోజూ మొక్కజొన్న పీచు నీటిని తాగితే దాని అదుపు చేయవచ్చు.
*చాలా మందికి ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నప్పటికి వారిలో అరుగుదల సరిగా ఉండదు. అలాంటి వారు ఎక్కువగా మధుమేహంతో ఇబ్బంది పడతారు. ఈ మొక్కజొన్న జుట్టు నుంచి వచ్చే నీరు తాగితే మధుమేహం సమస్య తగ్గుతుంది. దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. అలా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.