Site icon NTV Telugu

Diwali Child Safety Tips: దీపావళి వేడుకల్లో పిల్లలు భద్రం.. బాంబుల శబ్దాలతో ప్రమాదం ఎంత?

Diwali Firecracker Safety

Diwali Firecracker Safety

Diwali Child Safety Tips: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో పడి పిల్లలను పట్టించుకోకపోవడం చేస్తే చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బాంబుల శబ్దం చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఈ బాంబుల శబ్దాల కారణంగా చిన్న పిల్లలకు ప్రమాదం ఎంత ఉంది..

READ ALSO: Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్

చిన్నారులకు అనేక ప్రమాదాలు..
దీపావళి రోజున కాల్చే బాంబుల కారణంగా చిన్న పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల శరీరాలు, చెవులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పెద్ద శబ్దం వారి నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని సూచిస్తు్న్నారు. పెద్ద శబ్దాలు లేదా నిరంతర శబ్దాల కారణంగా పిల్లలు భయబ్రాంతులకు గురి అవుతారని చెబుతున్నారు. దీనివల్ల వారిలో అశాంతి, ఆందోళన పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది వారి నిద్రకు అంతరాయం కలిగించడంతో పాటు, వారి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని అంటున్నారు.

బాంబుల పెద్దపెద్ద శబ్దాలు చిన్న పిల్లల వినికిడిని ప్రభావితం చేస్తాయని నిపుణులు వెల్లడించారు. పదే పదే శబ్దానికి గురికావడం వల్ల వారి సున్నితమైన చెవిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది, దీంతో వారి వినికిడి బలహీనపడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంకా నిరంతర శబ్దం పిల్లలను మానసికంగా అస్థిరంగా లేదా భయపడేలా చేస్తుందని పేర్కొన్నారు. ఇది కొన్నిసార్లు తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, నిద్ర సమస్యలు, ఏడుపు పెరగడానికి కారణం అవుతుందని చెప్పారు. కొంతమంది పిల్లలు పెద్ద శబ్దం కారణంగా వాంతులు, తలతిరగడం లేదా ఆందోళనను వంటి సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాదాలన్నీ పిల్లలను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తాయని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సూచించారు.

దీపావళి బాంబులను కాల్చే సమయంలో వీటిని పాటించండి..

1. పిల్లలను బాంబుల శబ్దానికి దూరంగా ఉంచండి.

2. మీ చెవులను రక్షించుకోవడానికి ఇయర్‌ప్లగ్‌లు లేదా ఇయర్‌మఫ్‌లు ధరించాలి.

3. పండుగల సమయంలో పిల్లలను ఇంటి లోపల ప్రశాంత వాతావరణంలో ఉంచాలి.

4. పిల్లల్ని క్రమంగా బాంబుల శబ్దానికి అలవాటు చేయడానికి ప్రయత్నించాలి.

5. చిన్న పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు బిగ్గరగా శబ్దం చేసే ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచింది.

6. పిల్లలు భయపడితే లేదా అసాధారణంగా స్పందించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

READ ALSO: Digital Gold Vs Physical Gold: డిజిటల్ గోల్డ్ vs రియల్ గోల్డ్.. ఏది బెస్ట్ ?

Exit mobile version