Digital Fasting: ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ జీవి జీవితం స్క్రీన్‌కే అంకితమైపోతుంది. రోజుకు 8 నుంచి 10 గంటల సమయం ఆన్‌లైన్ విద్య అని, హైబ్రిడ్ వర్క్ మోడల్ వంటి కారణాలతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు వంటి గాడ్జెట్‌ల ముందు గడుపుతున్నాం. అవసరాలు, పనులు చూసుకుంటున్నారు కానీ ఈ గాడ్జెట్ల కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా.. మీకు డిజిటల్ ఉపవాసం గురించి తెలుసా.. ఈ ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ ఆలోచింపజేస్తుంది.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్
ఒక మంచి మార్గం..
రోజుకు 8 నుంచి 10 గంటల సమయం ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు వంటి గాడ్జెట్‌ల ముందు గడుపడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. దీంతో కళ్లకు ఒత్తిడి కలిగి తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, మెడ, భుజం నొప్పులు వంటి సమస్యలు ఎదురౌతాయని చెబుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ ‘డిజిటల్ ఉపవాసం’ అనేది చేయాలని సూచిస్తున్నారు. ఈ డిజిటల్ ఉపవాసం అనేది నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఒక మంచి మార్గం అని పేర్కొంటున్నారు. ఇంతకీ డిజిటల్ ఉపవాసం అంటే ఏంటని ఆలోచిస్తున్నారా.. ఏం లేదు.. ఒక నిర్దిష్ట సమయం పాటు డిజిటల్ గాడ్జెట్‌లకు దూరంగా ఉండటం. దీంతో కళ్లకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా, మానసిక అలసటను తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ చేసుకున్న వాళ్లు అవుతారని పేర్కొంటున్నారు.
పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల మయోపియా వంటి సమస్యలు పెరిగిపోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే, గాడ్జెట్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రలేమికి దారి తీస్తుందని, ఇది మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ సమస్యలను నివారించడానికి నిపుణులు ఒక సులభమైన చిట్కా ఇస్తున్నారు. అదే 20-20-20 నియమం. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. తగినంత వెలుతురు ఉన్న చోట పనిచేయడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అనవసరమైన స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పుడప్పుడు స్క్రీన్ నుంచి విరామం తీసుకోవడం వల్ల కేవలం కళ్లకు విశ్రాంతి లభించడమే కాదు, పని సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ డిజిటల్ ఉపవాసాన్ని పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: Inspirational Story: 75 ఏళ్ల వృద్ధుడి 20 లక్షల పుస్తకాల లైబ్రరీ.. నిజంగా వండర్
