ప్రతి రోజు మీరు టిఫిన్ లో భాగంగా ఓట్స్ తింటున్నారా అయితే.. మీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు అల్పహారంలో ఓట్స్ తీసుకోవడంతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని .. నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో ఓట్స్ ఇష్టమైన అల్పహారంగా మారింది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో కడుపునింపిన భావన కలిగిస్తుంది. ప్రతి రోజు ఓట్స్ మాత్రమే తినకుండా.. వేరే ఇతర ఫుడ్స్ ని ట్రై చేయాలంటున్నారు నిపుణులు. ఓట్స్ ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి, ముఖ్యంగా పాలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే మంచిదంటున్నారు. కానీ రోజు ఓట్స్ కొందరికి హానికరంగా మారుతున్నాయి. రోజూ ఓట్స్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ఏ వ్యక్తులు రోజూ వాటిని తినకుండా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Read Also: Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
మీరు ప్రతిరోజూ ఓట్స్ తింటుంటే, ఖచ్చితంగా ఈ 5 విషయాలపై శ్రద్ధ వహించాలని మణిపాల్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ పవిత్ర ఎన్ రాజ్ తెలిపారు. ఓట్స్‌లో గ్లూటెన్ రహితంగా ఉంటుందని.. కానీ చాలా కర్మాగారాలు గోధుమ, బార్లీ లేదా రై వంటి గ్లూటెన్ కలిగిన ధాన్యాలతో వాటిని ప్రాసెస్ చేస్తాయన్నారు. ఇది క్రాస్-కాలుష్యానికి దారితీస్తుందని.. దీంతో మీకు సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ అలెర్జీ ఉంటే..సర్టిఫైడ్ గ్లూటెన్ రహిత ఓట్స్‌ను మాత్రమే ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఒక వేళ మీరు ఎంచుకునే ఓట్స్ బాగాలేక పోతే.. మీకు కడుపు నొప్పి, ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు రావచ్చని తెలిపారు..
Read Also: Launch: పోర్స్చే 911 టర్బో ఎస్ కారు ధర ఎంతో తెలుసా..
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియకు మంచిది. కానీ మీ శరీరం ఫైబర్‌కు అలవాటుపడకపోతే, ఎక్కువ ఓట్స్ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, బరువుగా అనిపించవచ్చు. తక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవడంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటున్నారు డైటీషియన్ డాక్టర్ పవిత్ర. ఓట్స్ బరువు నియంత్రణకు సహాయపడినప్పటికీ, వాటిని అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంది. 100 గ్రాముల ఓట్స్‌లో దాదాపు 379 కేలరీలు ఉంటాయి. ఓట్స్, పండ్లు ఎండిన పండ్లతో తినడం వల్ల మీ కేలరీల తీసుకోవడంతో బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులు స్మూతీలు, పెరుగు లేదా కూరగాయల ఆమ్లెట్‌లను ఎంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీకు ఏదైనా సందేహాలు ఉంటే న్యూట్రిషీయన్ ఎక్స్ పర్ట్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
