రోజూ లవంగాల నీరు (క్లోవ్ వాటర్) తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఆరోగ్యం, దంత సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించడంలో లవంగాల నీరు ఎంతో సహాయపడుతుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలు కలిపిన నీటిని కనీసం పది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడటంతో పాటు, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కూడా ఉపయోగపడుతుంది.
మన పూర్వకాలం నుంచే వంటగదిలో లవంగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వంటకాలకు రుచి, వాసనను పెంచడమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, లవంగం అనేక ఆరోగ్య సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది. లవంగాల నీరు తాగడం వల్ల శరీరానికి కొత్త శక్తి లభించి, అలసట తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు.
ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేష్మాన్ని సడలించి బయటకు పంపడంలో సహాయపడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే శరీరంలోని అధిక వేడిని తగ్గించడంలో కూడా లవంగాల నీరు ఉపయోగపడుతుంది. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం కావున వీటిని ఫాలో అయ్యేముందు.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
