Health Tips: కోడి కూర అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అలా అని కక్కే వరకు మింగకూడదు. నిజమే కదా. అలాగే రోజు కూడా తినకూడదు. అన్ని తెలుసు అయినా వాటిని పాటించడం మాత్రం కొందరికి తెలియడం లేదు. సరే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి కొత్త లెక్క. అసలు రోజు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా. తెలిస్తే ఓకే.. తెలియకపోతే కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎన్ని చెప్పినా ముక్క లేనిదే ముద్ద దిగదంటారా.. సరే తర్వాత ఏమౌతుందో చూడండి..
READ ALSO: Dowry Harassment: పెళ్లయిన 4 నెలలకే.. వరకట్న దాహానికి నవ వధువు బలి..
డైలీ తింటే..
2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజూ చికెన్ తినే వ్యక్తులకు రక్తపోటు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోషకాహార ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్. ఫ్రాంక్ బావో పాల్గొన్నారు. ఆయన ఏం అంటున్నారు అంటే.. డైలీ చికెన్ తింటే రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి, రోజుకు 50 గ్రాములకు మించి చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. రోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే బాడీలో సోడియం శాతం కూడా అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. సోడియం ఎక్కువ అయితే దానితో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. మీకు తెలుసా స్కిన్లెస్చికెన్కన్నా.. స్కిన్ ఉన్న చికెన్ తినడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు.
చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు కోడి మాంసం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కోడి మాంసం తినడం వల్ల బాడీలో వేడి పేరుగుతుందని, దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. చికెన్ రోజూ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని.. దీనివల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
చికెన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని రోజూ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రై చికెన్ తింటే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటి తయారీలో నూనె, మసాలాలు, ఇతర కొవ్వు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని, చికెన్ రోజు తినవద్దని చెబుతున్నారు.
READ ALSO: Snoring Danger: బాబోయ్ ప్రాణాలు తీస్తున్న గురక.. మీకు ఈ అలవాటు ఉందా!
