NTV Telugu Site icon

Aluminium Cookware: వంటకు అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా? చాలా డేంజర్!

Aluminium Cookware

Aluminium Cookware

మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలు మరీ డేంజర్. ఎందుకంటే..

READ MORE: Maharashtra: ఐలవ్‌యూ అంటూ.. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేసిన ఉపాధ్యాయుడు.. కట్ చేస్తే..

యాసిడ్స్‌ కలిగిన పదార్థాలు, అంటే టమాటాలు, అలాగే పుల్లని పదార్థాలు కోసం అల్యూమినియం పాత్రలను వాడినపుడు చర్య జరిపి.. వీటి నుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుంది. ప‌రిశోధ‌న‌ల ప్రకారం తెలిసింది ఏంటంటే.. ఒకవేళ మనం ఇంట్లో అల్యూమినియం వస్తువులను వాడాల్సి వచ్చినపుడు కూడా వాటిలో ఎక్కువ సమయం పులుపు, యాసిడ్‌ కలిగిన పదార్థాలు నిల్వ ఉంచకుండాను, ఎక్కువ సమయం వేడి చేయకుండా వాడుకోవాలి. అయితే కూరలు క్రోమియమ్‌, లెడ్‌, కాడ్‌మియమ్‌, నికిల్‌ వంటి మిగిలిన వస్తువులలో కంటె అల్యూమినియంలో ఉడికించేటప్పుడు మూడింతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

READ MORE: Indian Passengers: ఆహారం, సాయం లేకుండా కువైట్ ఏయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు..

అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల, బ్రెయిన్‌లోని క్రోమాటిక్ నెట్ వర్క్ పైన ప్రభావం పడి , బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనల్లో రుజువైంది. అల్యూమినియం చేసే హాని నుంచి బయటపడాలంటే ఎనొడైజ్డ్‌ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలి. ఈ ఎనొడైజ్డ్‌ మెటల్‌తో తయారు చేసిన పాత్రలు, పాన్‌లు కూడా త్వరగా వేడెక్కడమే కాక, మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది. దానితో పాటు గీతలు పడకుండా, శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఎనొడైజ్డ్‌ అల్యూమినియం పాత్రలలో పదార్థాలు వండటం వల్ల అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే బాగా బాయిల్ చేసి వండే ఏ వంటకాన్నైనా అల్యూమినియం పాత్రల్ని వాడకపోవటమే మంచిదంటున్నారు.