Condom: కండోమ్ రంగు మారితే.. వ్యాధి ఉన్నట్లే.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సురక్షితమైన శృంగారం కోసం ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఎయిడ్స్ (HIV) వంటి ప్రమాదకర వ్యాధుల పట్ల హెచ్చరిస్తూనే ఉంటాయి. అయితే.. ఇప్పుడు లండన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. శృంగార సమయంలో ఎదుటి వ్యక్తికి ఏవైనా లైంగిక వ్యాధులు (STDs) ఉంటే.. ఈ కండోమ్ రంగు మారి హెచ్చరిస్తుంది. ఈ వినూత్న ఆవిష్కరణ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముగ్గురు విద్యార్థుల అద్భుత సృష్టి..
Also Read
- COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
- FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
- Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
- Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
లండన్‌లోని న్యూటన్ అకాడమీ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు– చిరాగ్ షా, ధన్యాల్ అలీ, ముఆజ్ నవాజ్ ఈ రంగులు మార్చే కండోమ్‌ను కనిపెట్టారు. వీరికి కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ ఆలోచన రావడం విశేషం. వీరి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా పలు అవార్డులు కూడా దక్కాయి.
ఇది ఎలా పనిచేస్తుంది..?
ఈ కండోమ్ ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన పొర (Coating) ఉంటుంది. ఇది బ్యాక్టీరియా లేదా వైరస్ వంటి వ్యాధి కారక క్రిములను గుర్తించిన వెంటనే రంగు మారుతుంది. ఏ వ్యాధికి ఏ రంగు మారుతుందో కూడా ప్యాకింగ్ మీద స్పష్టంగా వివరించారు.
రంగుల సంకేతాలు..
ఈ కండోమ్ ట్రాఫిక్ సిగ్నల్ లాగా పనిచేస్తూ మన ఆరోగ్యం పట్ల మనల్ని అలర్ట్ చేస్తుంది. ఏ రంగు వస్తే ఏ వ్యాధి ఉన్నట్లో ఈ విధంగా గుర్తించవచ్చు. క్లామిడియా (Chlamydia) అనే వ్యాధి ఉంటే కండోమ్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. హెర్పెస్ (Herpes) వైరస్ సోకినప్పుడు ఆ కండోమ్ ఎల్లో కలర్లోకి మారుతుంది. సిఫిలిస్ (Syphilis) అనే వ్యాధిని గుర్తించినప్పుడు బ్లూ కలర్లోకి మారుతుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఉంటే పర్పుల్ రంగులోకి మారుతుంది.
దీని వల్ల ఉపయోగాలు ఏంటి..?
చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి వ్యాధి ఉందన్న విషయం వారికే తెలియదు. అటువంటి సమయంలో ఈ కండోమ్ ద్వారా వెంటనే విజువల్ అలర్ట్ లభిస్తుంది. దీనివల్ల వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం రక్షణ కోసమే కాకుండా, ముందస్తు ఆరోగ్య హెచ్చరికగా కూడా పనిచేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉందా?
ఈ ఆలోచన 2015లోనే వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే.. ఈ కండోమ్ తయారీ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో ఇంకా భారీ స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. అలాగే దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయంపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి.. ప్రస్తుతానికి ఇది మార్కెట్లో సాధారణ కండోమ్స్ లాగా అందుబాటులో లేదు.
యువతలో లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి.. వ్యాధులు వ్యాపించకుండా ఆపడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో అవసరం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు భవిష్యత్తులో సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాయని ఈ విద్యార్థులు నిరూపించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!