అధిక బరువు సమస్య ఈరోజుల్లో కామన్ అయిపొయింది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారీ శరీరంతో ఉంటున్నారు..అలాంటి వారికి కోసం సులువుగా బరువు తగ్గించే సూపర్ చిట్కాను తీసుకొచ్చాము..ఈ టీ ని తాగడం వల్ల ఒక్క నెలల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి… జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. అదేంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
దాల్చిన చెక్క టీ.. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి మధ్యస్థ మంటపై నీటిని మరిగించాలి. ఇలా పది నిమిషాల పాటు మరిగించిన తరువాత ఈ టీ ని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం వేగంగా బరువు తగ్గవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని తాగుతూనే రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ గంట వ్యాయామం చేయాలి..
పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.. పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి..కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను, ప్రాసెస్ట్ ఫుడ్ ను తీసుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ దాల్చిన చెక్క టీ ని తాగడం వల్ల చాలా సులభంగా అధిక బరువు ను సులువుగా తగ్గుతారు.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గుతాయి.. సర్వ రోగ నివారణగా దాల్చిన చెక్క పని చేస్తుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాంటి ఫలితం ఉందో కామెంట్ చెయ్యండి..
