Chocolate Pootharekulu: పూతరేకుల్లో చాక్లెట్ ట్విస్ట్! ఇలా ఎప్పుడైనా తిన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chocolate Pootharekulu: పూతరేకులు అంటే మనలో ఎంతమందికి ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అయితే ఎప్పుడూ తినే పంచదార, బెల్లం పూతరేకులు కాకుండా… క్రంచీ మంచ్, నోరూరించే చాక్లెట్ కాంబినేషన్‌తో సరికొత్తగా ‘చాక్లెట్ పూతరేకులు’ ఎప్పుడైనా ట్రై చేశారా? వినడానికే కాకుండా తింటే కూడా అమేజింగ్‌గా ఉండే ఈ క్రేజీ ఫ్యూజన్ స్వీట్‌ను ఇంట్లోనే నోరూరించేలా ఎలా తయారుచేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పూతరేకుల రేకులు (రేకులు): 4 నుంచి 6 (మార్కెట్లో సిద్ధంగా దొరుకుతాయి)
Also Read
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు (కరిగించినది)
చాక్లెట్ సిరప్ (హర్షీస్ వంటివి): తగినంత
మంచ్ లేదా కిట్‌క్యాట్ చాక్లెట్లు: 2 (సన్నగా తురిమినవి లేదా ముక్కలు చేసినవి)
చాక్లెట్ చిప్స్ / కోకో పౌడర్: 1-2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)
జీడిపప్పు, బాదం ముక్కలు: కొన్ని (ఆప్షనల్)
తయారీ విధానం:
మొదట ఒక శుభ్రమైన ప్లేట్ లేదా బోర్డు మీద ఒక పూతరేకును పరిచి, దానికి కరిగించిన నెయ్యిని సమానంగా రాయాలి. నెయ్యి రాసిన రేకుపై చాక్లెట్ సిరప్‌ను అంతటా సమానంగా పరచాలి. దానిపై తురిమిన మంచ్ (Munch) లేదా కిట్‌క్యాట్ ముక్కలు, కోకో పౌడర్, చాక్లెట్ చిప్స్‌ను చల్లాలి. నట్స్ ఇష్టపడేవారు జీడిపప్పు, బాదం ముక్కలను కూడా వేసుకోవచ్చు. దానిపై మరో పూతరేకును ఉంచి, మళ్లీ నెయ్యి, చాక్లెట్ సిరప్‌ను పూసి మడతపెట్టడానికి అనువుగా చేయాలి. రేకు చిరిగిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా లోపలికి మడిచి, రోల్ (సుట్ట) మాదిరిగా చుట్టాలి. మడతపెట్టే సమయంలో నెయ్యి అప్లై చేస్తే రేకు విరిగిపోకుండా సులభంగా మడతపడుతుంది. చివరగా రోల్ చేసిన చాక్లెట్ పూతరేకు పైన కొద్దిగా చాక్లెట్ సిరప్, చాక్లెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన చాక్లెట్ పూతరేకులు రెడీ.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!