NTV Telugu Site icon

Chicken Side Effects : రోజూ చికెన్ ఎందుకు తినొద్దో తెలుసా.. వామ్మో నిజామా?

Chiken

Chiken

చికెన్ ను తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి.. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయినప్పటికీ.. చికెన్ ను రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. చికెన్ తో ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు.. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది. అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. అయితే రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రోజూ చికెన్ ను తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి.. మనం శరీరానికి రోజుకు 35 శాతం మాత్రమే ప్రోటీన్స్ అవసరమావుతాయి.. ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ ను తీసుకుంటే మన శరీరం దానిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది.. ఇక కొవ్వు పెరిగితే అధిక బరువు కూడా పెరుగుతారు..

చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. ఇది గండెపోటుతో పాటుగా ఇతర గుండె జబ్బులను కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ లేదా ఇతర ఆహారాలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక చికెన్ ను సరిగ్గా ఉడకపెట్టక పోయిన ప్రమాదమే..దీనిలో సాల్మొనెల్లా లేదా క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా బయటకు రావొచ్చు. ఈ బ్యాక్టీరియా మన శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తాయి.. ఇలాంటివి తింటే ప్రాణంతకర వ్యాదులు కూడా వచ్చే అవకాశం ఉంది.. బీ కేర్ ఫుల్ మిత్రమా…

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments