సాధారణంగా నాన్ వెజ్ అంటే ఎక్కువ మంది చికెన్ ను ఇష్టపడతారు.. రోజు చేసుకొనే విధంగా కాకుండా కొత్తగా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చికెన్ రోస్ట్ ను ఒకసారి ట్రై చెయ్యండి..చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే మనం ఈ చికెన్ వేపుడును రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లో మాదిరిగా చికెన్ రోస్ట్ ను ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ – కిలో,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3,
సన్నగా తరిగిన టమాటాలు – 3,
సన్నగా తరిగిన కొత్తిమీర – ఒక కట్ట,
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5,
అల్లం – ఒక ఇంచు ముక్క,
వెల్లుల్లి రెబ్బలు – 10,
లవంగాలు – 6,
దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క,
ఉప్పు – తగినంత,
పసుపు – అర టీ స్పూన్,
నూనె – 5 టేబుల్ స్పూన్స్,
కరివేపాకు – రెండు రెమ్మలు,
కారం – 2 టీ స్పూన్స్,
ధనియాల పొడి – 2 టీ స్పూన్స్,
జీలకర్ర పొడి – అర టీ స్పూన్,
మిరియాల పొడి -ఒక టీ స్పూన్,
కసూరి మెంతి – ఒక టీ స్పూన్,
గరం మసాలా – ఒక టీ స్పూన్…
మసాలా దినుసులు..
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ లోకి చికెన్ ను తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి..జార్ లో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.. ఈ పేస్ట్ ను చికెన్ లో వేసి బాగా కలపాలి.ఇక ఇందులోనే ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి పెద్ద మంటపై 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి.. మళ్లీ చిన్న మంట మీద వేయించాలి.. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కసూరి మెంతి, గరం మసాలా వేసి కలపాలి. ఈ చికెన్ ను ,ఇన్న మంటపై మరో 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొత్తి మీరతో గార్నిష్ చేసుకోండి.. అంతే రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయినట్లే.. వేడి వేడిగా సర్వ్ చేసుకొని కుమ్మేయ్యండి.. మీకు ఈ విధానం నచ్చితే ట్రై చెయ్యండి..