NTV Telugu Site icon

Making Chicken Pizza : చికెన్‌ పిజా ఇంట్లోనే చేసుకోండిలా …

Chiken Pizza

Chiken Pizza

చికెన్‌ పిజా తయారీకి కావాల్సిన పదార్థాలు.. రా ఓట్స్‌, చికెన్‌, బెల్‌పెప్పర్స్‌, చిల్లీ ఫ్లేక్స్‌, సాల్ట్‌, పెప్పర్‌, బట్టర్‌, ఛీజ్‌, ఆనియన్‌, ఆలివ్ ఆయిల్‌.

చికెన్‌ పిజా తయారీ చూద్దాం. బెల్‌ పెప్పర్స్‌, ఆనియన్‌ మరియు చికెన్‌ కట్‌ చేసి పెట్టుకోవాలి. పాన్‌ వేడి అయ్యాక ఓట్స్‌ వేయాలి. రా ఓట్స్‌ పచ్చిగా ఉంటాయి కాబట్టి 5 నిమిషాలు పాన్‌లో వేయించాలి. ఆ టైంలో సాల్ట్‌, పెప్పర్‌ వేయాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. ఓట్స్‌ను మిక్సీ పడితే పౌడర్‌ అవుతుంది. ఆ పొడి పిండికి కొంచెం నీళ్లు కలిపి స్పూన్‌తో తిప్పి మళ్లీ మిక్సీ పట్టాలి. దీంతో తడి పిండి వస్తుంది. పాన్‌ పైన బ్రష్‌తో ఆయిల్‌ పూసి ఈ ఓట్స్‌ మిశ్రమాన్ని పోయాలి. 1-2 నిమిషాలు అలా ఉంచి మరో వైపుకు తిప్పేసి వేడి చేయాలి. ఇప్పుడు పిజా స్టఫ్‌ రెడీ చేద్దాం. గిన్నెలో 1 స్పూన్‌ బటర్‌ వేయాలి. అది కరిగాక బెల్‌ పెప్పర్స్‌ ముక్కలు, తర్వాత చికెన్‌ ముక్కలు కలపాలి. వాటిని 3-4 నిమిషాలు స్పూన్‌తో తిప్పాలి. సాల్ట్‌ మరియు పెప్పర్‌ను యాడ్‌ చేసి చివరలో ఆనియన్‌ ముక్కలు వేయాలి. పిజా బేస్‌కి ఒక వైపు సాస్‌ లాగా అప్లై చేయాలి. తర్వాత.. బెల్‌ పెప్పర్స్‌, చికెన్‌, ఆనియన్‌ ముక్కలను సాస్‌ మీద వేసుకోవాలి. వెజిటేరియన్లు.. పన్నీర్‌, మష్రూమ్స్‌.. ఇలా ఏదైనా వాళ్ల ఛాయిస్‌ను బట్టి సెలెక్ట్‌ చేసుకోవచ్చు. పిజా మీద తక్కువ ఛీజ్‌ వేసి ఫైనల్‌గా మైక్రో ఓవెన్‌లో 2 నిమిషాలు ఉంచాలి. ఇలా రెడీ అయిన మీడియం సైజ్‌ చికెన్‌ పిజాను 6-8 ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు. ఈ వంటకం ద్వారా ప్రొటీన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్స్‌ మన బాడీకి లభిస్తాయి. మరెందుకు ఆలస్యం?. నోరూరించే ఈ న్యూట్రిషనల్‌ రెసిపీని మీరూ ట్రై చేయండి.