ప్రతి సీజన్లో వ్యాధులు వస్తూనే ఉంటాయి.. మారిన కాలానికి తగ్గట్లు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ మధ్య ఎక్కువగా జనాలు ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా మేలు చేస్తాయి.. అందుకే వీటిని ఏదోక రూపంలో తీసుకుంటారు.. ఈరోజు మనం తేనెలో జీడిపప్పులను వేసుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీడిపప్పును మనలో చాలా మంది వేగించుకొని లేదా పంచదార లేదా బెల్లం పాకం పట్టుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా జీడిపప్పును తేనెలో నానబెట్టి తింటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. వీటిలోకాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ ప్రోటీన్స్ సోడియం విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కె యాంటీఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
తేనె గురించి అందరికీ తెలుసు.. తేనెను తీసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి.. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజుకు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.