బరువు తగ్గాలని అనుకొనేవారు క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.. టీ కాఫీలకు బదులుగా కొన్ని డ్రింక్ లను తీసుకోవడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా సులువుగా బరువు తగ్గుతారు.. హెర్బల్ డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రోకలీ కాఫీ కూడా ఒకటి. దీన్ని ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.. దానివల్ల ఎక్కువగా తినడానికి ఇష్టపడరు.. అంతేకాదు అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి.. ఫోలేట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి.. డైట్ చేసేవారు ఈ కాఫీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..
ఈ కాఫీని ఎలా తయారు చెయ్యాలంటే?
బ్రోకలీ ని క్లీన్ చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. దీనిని పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్రోకలీ పౌడర్‌ని మీ రెగ్యులర్ కాఫీ పౌడర్‌లో మిక్స్ చేయండి.. దాన్ని మీరు రోజు కాఫీ చేసుకున్నట్లు అంటే డికాషన్ చేసుకున్నట్లు చేసుకొని తాగడం మంచిది.. ఉదయం, సాయంత్రం తాగితే మంచిది.. ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల పౌడర్ వేసి మరిగించి తాగాలి.. ఇలా రెగ్యూలర్ గా తాగితే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
