Site icon NTV Telugu

Breast Cancer in Women: మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.? ఈ లక్షణాలు ఉంటే కన్ఫార్మ్!

Breast Cancer In Women

Breast Cancer In Women

Breast Cancer in Women: బ్రెస్ట్ క్యాన్సర్.. ప్రస్తుత జీవన మార్గంలో మహిళల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారింది. ఈ వ్యాధి ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు. దీని వెనుక కాలక్రమంగా జరిగే శారీరక మార్పులు, అలవాట్లు, జీవనశైలి భిన్నతలు ప్రధానంగా కారణమవుతుంటాయి. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా అందించడం, ఆరోగ్యంగా జీవించే అవకాశం పెరుగుతుంది. అయితే చాలామంది మహిళలు లక్షణాలను పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది.

ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. అందులో మొదటిది వంశపారంపర్య కారణాలు. నిపుణల ప్రకారం.. కుటుంబంలో ఎవరికైనా.. అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క లేదా చెల్లెలు వంటి బంధువులెవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లైతే.. ఇతర కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది నేరుగా సంక్రమించే వ్యాధి కాకపోయినా.. శరీరంలో క్యాన్సర్ కారకాలను పెంచేలా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేవలం వృద్ధాప్యంలో మాత్రమే కాదు.. 30 నుంచి 35 ఏళ్ల మహిళల్లోనూ కనిపించడం ఆందోళనకరం.

Kangana Ranaut: స్టార్ హీరోయిన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్‌ కొట్టివేత!

ఇక రెండవ కారణం.. జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆధునిక జీవనశైలిలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం లేని జీవితం, మద్యం సేవించడం, ధూమపానం, అధిక బరువు, మానసిక ఒత్తిడి, శారీరక చురుకుతనం లేకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం వంటి అలవాట్లు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఈ కారణాలన్నీ మన దైనందిన జీవనశైలి భాగంగా ఉన్నప్పటికీ, దీని ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుంది.

ఇకపోతే, బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. బ్రెస్ట్ ప్రాంతంలో కణతి (లంప్) కనిపించడం, ఒకవైపు బ్రెస్ట్ లేదా చేతి భాగాల్లో గంతులు రావడం, బ్రెస్ట్ నుండి రక్తస్రావం జరగడం, రెండు బ్రెస్టుల ఆకారాల్లో తేడా రావడం, నిప్పిల్స్‌లో నొప్పి, నిరంతరంగా రసస్రావం ఉండడం, నిప్పిల్ లేదా బ్రెస్ట్ రంగులో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే, చాలా మహిళలు వీటిని సాదారణంగా తీసుకొని చికిత్స కోసం ఆలస్యం చేస్తుంటారు. దానితో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.

ENG vs IND: అందరికీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్‌లోకి వెళ్లాడు

అయితే, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ప్రతి మహిళ నెలలో ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ‘మమ్మోగ్రఫీ’ టెస్టు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన నిద్రపోవడం వంటి శ్రద్ధలు తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. చివరకు చెప్పేదేంటంటే.. ముందస్తు జాగ్రత్తే రక్షణ. ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకుండా, ప్రతి చిన్న మార్పును గమనించి భయపడకుండా వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ ను ధైర్యంగా ఎదురించవచ్చు.

Exit mobile version