మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అంగాలు ఆరోగ్యంగా పని చేయాలి. అప్పుడే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. మన శరీరం చాలా పక్రియలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రతీరోజూ శరీరం నుండి జరిగే విసర్జన ప్రక్రియ సక్రమంగా ఉండి తీరాల్సిందే. శరీరం నుండి రోజూ జరిగే మూత్ర విసర్జన విషయంలో తగిన దృష్టి పెట్టాలి. రోజులో మూత్రం ఎన్ని సార్లు వస్తుంది? ఏ రంగులో వస్తుంది? ఎలా వస్తుంది? మూత్రంలో నురగ ఎక్కువగా వస్తుందా? మూత్ర విసర్జన సమయంలో ఏదైనా మంటగా ఉందా? వంటి అంశాలను గమనించుకోవాలి. మరి కొంత మందికి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు అది అంత మంచిది కాదు. మరి ఏం చేయాలి ఇప్పుడు చూదాం.
* మూత్రంలో రక్తం కనిపించగానే క్యాన్సర్ అనుకుని భయపడుతుంటారు. నిజానికి మూత్రంలో రక్తం కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని, ఇది కేవలం క్యాన్సర్ అనుమానిత సంకేతం అని తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.
* మూత్రంలో రక్తం పడటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్లు వచ్చినట్లయితే మూత్రంలో రక్తం కనిపిస్తుంది. కిడ్నీలోని రాయి జారి పైపులో ఇరుక్కొని పోయినపుడు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చని చెబుతున్నారు. కిడ్నీలో నుంచి రాయి వచ్చి బ్లాడర్‌లోకి రావడంతో కూడా రక్తం వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు .
* కిడ్నీ నుంచి బ్లాడర్ దాకా ఎక్కడైనా ట్యూమర్ వచ్చినా దానితో కూడా మూత్రంలో రక్తం వస్తుంది. బ్లడ్‌క్లాట్ కాకుండా మందులు వాడేవారు, స్టంట్ వేసుకున్నపుడు కూడా రక్తం వస్తుందని వెల్లడిస్తున్నారు. ఇవే కాకుండా బీట్రూట్ వంటి ఎరుపు రంగు పదార్థాలు తీసుకున్న, కొన్ని రకాల మందులు వాడినా వాటి కారణంగా కూడా మూత్రంలో రక్తం పడే అవకాశం ఉంటుంది.
* ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి మూత్రంలో రక్తం పడితే చాలా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు టేస్ట్‌లు చేయించుకుంటు దానికి తగిన మందులు వాడుతుండాలి. అయితే ఎలాంటి నొప్పి లేకుండా రక్తం పడుతుంటే 30 శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా అయితే కనుక యూరిన్ టెస్ట్, అల్ట్రా సౌండ్ స్క్రీనింగ్, క్యాట్, సిస్టోస్కోపీ, సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.