NTV Telugu Site icon

Birth control pills : పిల్లలు కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే వారికి బిగ్ అలర్ట్..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

వివాహం అయ్యాక కొంత మంది వెంటనే పిల్లలు వద్దు అనుకునేవారు..మొదటి సంతానానికి, రెండో ప్రసవానికి మధ్య గ్యాప్ ఉండాలనుకునేవారు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంటారు. ఇలా.. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే వాటిని వినియోగించే ముందు అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. లేదంటే వీటి వాడకం వల్ల పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. ఈ చిన్న మాత్రలు గర్భాన్ని నిరోధించినప్పటికీ.. శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. కాబట్టి.. ఈ పిల్స్ వాడే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఈ స్టోరీ లో చూద్దాం..

గర్భ నిరోధక మాత్రలు ఎలా పనిచేస్తాయి..
సాధారణంగా మహిళల్లో ప్రతి నెల అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చిందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్‌ల్లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి. ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా.. స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది. సాధారణంగా ఈ గర్భ నిరోధక మాత్రల్లో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ కాంబినేషన్ ఉన్నవి. రెండోది.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్నవి మాత్రమే. అయితే.. వీటిలో మీరు ఎంచుకునే దాన్ని బట్టి అవి ఆరోగ్యం పై చూపే సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కొంతమందిలో ఈస్ట్రోజెన్ ఉన్న పిల్స్ ఉపయోగించడం వల్ల ‘బీపీ’ పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి, ఇప్పటికే బీపీ ఉన్నవారైనా, లేనివారైనా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ కాంబినేషన్ ఉన్న పిల్సు దూరంగా ఉండడం మంచిది. అందుకు బదులుగా.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్న పిల్స్ ఉపయోగించడం కొంతవరకు బెటర్. అలాగని ఇవి ఆరోగ్యానికి మంచివని చెప్పట్లేదు.

హార్మోన్లతో జాగ్రత్త..
బర్త్ కంట్రోల్ పిల్స్ లో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి. గర్భం ధరించడం లో ఈ హార్మోన్లు పెద్ద పాత్రను పోషిస్తాయి. కనుక ఈ మాత్రలు వేసుకోవడం వల్ల హార్మోన్లను పనిచేయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల గర్భం రాదు. కానీ గర్భనిరోధక మాత్రల్లో ఉన్న కృత్రిమ హార్మోన్లు స్త్రీ శరీరంలో పురుషత్వ లక్షణాలను ఎక్కువ అయ్యేలా చేస్తాయి. అంటే ఈ మాత్రలు వాడే మహిళల ముఖంపై చర్మం మందంగా మారిపోవడం.. ముఖంపై వెంట్రుకలు విపరీతంగా పెరగడం మొదలవుతాయి. అలాగే మొటిమలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఈ వ్యాధుల ముప్పు తప్పదు..
గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం, కొన్ని రకాల క్యాన్సర్లు, పాలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్, మూత్రపిండాల వ్యాధులు, వికారం, వాంతులు, రొమ్ము నొప్పి, పీరియడ్స్ సమయంలో రొమ్ము గడ్డ కట్టడం, ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కాబట్టి హార్మోన్లను ప్రభావితం చేసేలా గర్భనిరోధక మాత్రలు, ఇంజక్షన్ లు వాడకపోవడం మంచిది.

ఎవరు వీటిని వాడకూడదు..?
ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్న వారు, స్మోకింగ్ అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలు అస్సలు వాడకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ట్యూబులను ప్రభావితం చేస్తాయని.. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మాత్రలను వాడొద్దని సూచిస్తున్నారు.

గర్భనిరోధక పద్ధతులు కూడా అందరికీ ఒకే రకంగా పనిచేయవు. సేఫ్ పీరియడ్స్ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్ పద్ధతుల వరకు ఇలా చాలా ఉంటాయి. అందుకే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏవి సరిపడతాయో వైద్యులు సూచిస్తారు. సాధారణంగా మహిళల్లో అండం విడుదల సమయానికి ముందు 5 రోజుల్లో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితిలో ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలలో అన్నిటికన్నా సమర్థవంతమైనది కాపర్ టీ. కాపర్ టీ అంటే ఒక రకమైన గర్భనిరోధక పరికరం (IUD), ఇది T ఆకారంలో ఉండే ప్లాస్టిక్ ముక్కకు రాగి తీగతో చుట్టబడి ఉంటుంది, ఇది గర్భాశయం లో ఉంచి గర్భం రాకుండా నిరోధిస్తుంది. అయితే రక్షణ లేకుండా కలయిక జరిగిన 5 రోజుల లోపు గర్భాశయంలో కాపర్ టీ గనక మార్చగలిగితే గర్భం రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే మహిళలు, పురుషులకు కండోమ్ లు ఉంటాయి వాటిని వాడొచ్చు. అవాంఛిత గర్భం, అబార్షన్ చేయించుకోవడం వల్ల వచ్చే సమస్యల కంటే గర్భనిరోధక సాధనాలు వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు ఎన్నో రెట్లు తక్కువ. కాబట్టి ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.