Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathroom Tiles Cleaning Tips: వాష్‌రూమ్ లేదా బాత్రూమ్ టైల్స్ ఎంత శుభ్రం చేసినా నీటి మరకలు, గార పట్టిన మురికి అలాగే ఉండిపోతుంటాయి. వీటిని తొలగించడానికి సాధారణంగా హార్పిక్ లేదా యాసిడ్ వంటి ఘాటైన రసాయనాలను వాడుతుంటారు. అయితే, వీటిని తరచుగా వాడటం వల్ల వచ్చే ఘాటైన వాసన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేకుండా, ఇంట్లోనే లభించే సాధారణ వస్తువులతో శక్తివంతమైన క్లీనింగ్ లిక్విడ్‌ను తయారుచేసుకుని, పెద్దగా రుద్దే శ్రమ లేకుండానే వాష్‌రూమ్‌ను తళతళలాడేలా ఎలా మార్చవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
క్లీనింగ్ లిక్విడ్ తయారీకి కావలసిన వస్తువులు
* వేడి నీళ్లు (హాట్ వాటర్)
* బట్టలు ఉతికే లిక్విడ్ డిటర్జెంట్ (ఉదాహరణకు ఏరియల్ లేదా ఏదైనా వాషింగ్ లిక్విడ్)
* ఏదైనా షాంపూ (ఒకటి లేదా రెండు సాచెట్లు)
* బేకింగ్ సోడా / వంట సోడా – 2 టీస్పూన్లు (మరకలు ఎక్కువగా ఉంటే మరికొంత జోడించవచ్చు)
* వెనిగర్ – 1 టీ గ్లాస్
* హ్యాండ్ వాష్ లిక్విడ్ – కొద్దిగా
* టూత్‌పేస్ట్ – తగినంత (వైట్ కోల్గేట్ లేదా ఇంట్లో మిగిలిపోయిన ఏ పేస్ట్ అయినా పర్వాలేదు)
Also Read
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
తయారీ విధానం
ముందుగా ఒక ప్లాస్టిక్ బౌల్ లేదా డబ్బాను తీసుకుని అందులో తగినన్ని వేడి నీళ్లను పోసుకోవాలి. ఆ వేడి నీటిలో కొద్దిగా వాషింగ్ మెషిన్ లిక్విడ్ డిటర్జెంట్, ఒక ప్యాకెట్ షాంపూ, రెండు చెంచాల వంట సోడా మరియు ఒక టీ గ్లాస్ వెనిగర్ వేయాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్, ఏదైనా టూత్‌పేస్ట్‌ను వేయాలి. వేడి నీళ్ల వల్ల పేస్ట్, సోడా త్వరగా కరిగిపోతాయి. ఈ పదార్థాలన్నింటినీ నీటిలో ఉండలు లేకుండా బాగా కలిపితే హోమ్మేడ్ క్లీనింగ్ మిశ్రమం సిద్ధమవుతుంది.
తయారు చేసుకున్న ఈ లిక్విడ్‌ను వాష్‌రూమ్ ఫ్లోరింగ్, బేసిన్ లేదా గార పట్టిన టైల్స్‌పై సమానంగా చల్లుకోవాలి. లిక్విడ్ వేసిన తర్వాత సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా నానబెట్టడం వల్ల వంట సోడా, వెనిగర్ మరియు పేస్ట్ కలిసి మొండి మరకలను తేలికగా వదిలించేస్తాయి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేస్తే సరిపోతుంది. గట్టిగా బ్రష్‌తో రుద్దాల్సిన శ్రమ కూడా ఉండదు. ఈ చిట్కా ద్వారా టైల్స్‌పై పేరుకుపోయిన నీటి గార, పసుపు మరకలు పూర్తిగా తొలగిపోయి వాష్‌రూమ్ కొత్తదానిలా తెల్లగా మెరుస్తుంది. ఎటువంటి దుర్వాసన లేకుండా, ఆరోగ్యానికి హాని కలగకుండా వాష్‌రూమ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ఇది ఒక చక్కని పరిష్కారం.
తాజావార్తలు
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!