Site icon NTV Telugu

Health Tips : మహిళలు దాల్చిన చెక్కను ఎందుకు తీసుకోవాలో తెలుసా? అస్సలు నమ్మలేరు..

Cinnamon

Cinnamon

మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన ఒకటి.. ఇది కేవలం వంటల్లో సువాసనలు పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దాల్చిన చెక్క అనేది హార్మోన్లను నియంత్రించే గుణం ఉంటుంది. గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది.. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. కడుపు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి..

ఇకపోతే పిసిఓఎస్ సమస్యతో బాధపడే స్త్రీలల్లో నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివిటీ మెరుగుపడుతుంది…షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు.. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.. అంటే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది..

గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఇది బాగా సహాయపడుతుంది.. అంతేకాదు గుండె సమస్యల నుంచి బయట పడవేస్తుంది.. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కడుపులో అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.. రోజు ఉదయం గ్లాస్ వేడి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.. ఎన్నో సమస్యలకు దూరం కావచ్చు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version