Site icon NTV Telugu

Aloe Vera juice: పరగడుపున కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల ఆ సమస్యలు దూరం..

Alovera Juice

Alovera Juice

కలబంద వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.. పరగడుపు న కలబంద జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఈ జ్యూస్ ను ఎలా తయారు చెయ్యాలంటే.. ఒక గ్లాస్‌ నీళ్లలో 5 టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జు, కొంచెం నిమ్మరసం, తేనె వేసుకోవాలి.. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ని టాక్సిన్స్‌ని బయటకు పంపి, శరీరాన్ని క్లీన్ చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ తొలగితే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది, పోషకాల ను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ త్వరగా బరువు తగ్గడానికి తోడ్పడుతోంది.. అదే విధంగా మలబద్ధకం తో బాధపడేవారికి కలబంద ఔషధంలా పనిచేస్తుంది. కలబందలో విటమిన్లు, మినరల్స్, యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా తోడ్పడతాయి.

ఇది మలాన్ని మృదువుగా చేసి.. మలబద్ధకానికి చెక్‌ పెడతాయి. ఇది ఉదయం ఖాళీ కడుపు తో కలబంద జ్యూస్‌ తాగితే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి.. జీర్ణ వ్యవస్థ కూడా బాగా పని చేస్తుంది.. ఇకపోతే ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యల ను కలబంద పరిష్కరిస్తుంది. ఉదయాన్నే కొద్ది మొత్తంలో కలబంద రసం తాగితే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ తగ్గవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. చర్మం, జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు..

Exit mobile version