NTV Telugu Site icon

Lemon in Whiskey: విస్కీలో నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్ కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Lemon In Whiskey

Lemon In Whiskey

Lemon in Whiskey: మద్యం వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. తాగేటప్పుడు ఏం కలుపుకోవాలి, రుచి పెరగాలంటే ఏమేమి కలిపి తాగితే బాగుంటుందనే అంశాలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాయి. విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ లేదా సోడా కలపడం పాత పద్ధతి అని చాలామంది అంటున్నారు. జిన్, టానిక్ వాటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది విస్కీతో కలిపితే మంచి మిక్సర్‌గా పనిచేస్తుంది. టానిక్ వాటర్.. విస్కీ కలిపితే రుచి పెరుగుతుంది. ఈ రెండూ కలిపిన తర్వాత రెండు ఐస్ క్యూబ్స్ వేయాలి. పొడవాటి గ్లాసులో రెండు షాట్‌ల విస్కీని పోసి, కొద్దిగా నిమ్మరసం, రెండు ఐస్ క్యూబ్‌లను జోడించి మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయండి. విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ వేసి, దాని పైన కూల్ డ్రింక్ కలిపితే అద్భుతమైన కాంబినేషన్ అనే చెప్పొచ్చు. కొత్తగా ప్రయత్నించాలనుకునే వారు విస్కీ షాట్‌లో ఎనర్జీ డ్రింక్‌ని జోడించవచ్చు. ఒక పెగ్ విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ వేసి దాని పైన అల్లం రసం వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు మందుబాబు. దానికి నిమ్మరసం కలిపితే కాక్‌టెయిల్‌ సిజ్లింగ్‌గా ఉంటుంది.

Read also: CM Chandrababu: పవన్ కళ్యాణ్ నాతో కలిసింది అందుకే..

విస్కీతో ప్రయోజనాలు..

పరిమిత పరిమాణంలో విస్కీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. విస్కీ గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విస్కీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. జలుబు లక్షణాలను తగ్గిస్తాయి. విస్కీ శ్వాసనాళంలో శ్లేష్మం కరిగించి దగ్గు, ఛాతీ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విస్కీ తాగడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. విస్కీని మితంగా తాగడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Read also: CM Chandrababu: రేవంత్‌ రెడ్డిని అందుకే కలిసాను.. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు..

విస్కీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఈ ప్రయోజనాలన్నీ విస్కీని పరిమితంగా తీసుకోవడం వల్ల వస్తాయి. అతిగా తీసుకోవడం మంచిది కాదు. వైద్యుల సూచనలు, సలహా మేరకు మద్యం సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. మరోవైపు బ్రాందీ, విస్కీ, రమ్, బీర్ వంటి మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా యువత కూడా పార్టీలు, ఫంక్షన్లు, వారాంతపు సెలవుల పేరుతో మద్యం సేవిస్తున్నారు. వీరిలో పురుషులే కాదు మహిళలు కూడా ఉండటం బాధాకరం. మహిళలు రంగు పెరుగుతారని, బరువు తగ్గుతారనే ఆశతో జిన్‌, వైన్‌, బీర్‌ తాగుతున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి సనాతన భారతీయ సంప్రదాయాన్ని వదిలేస్తున్నారని ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Bandi Sanjay: తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు…