మన శరీరంలో కిడ్నీలు ఒక అత్యంత ముఖ్యమైన అవయవం. అవి వ్యర్థాలను తొలగించడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఖనిజాలను నియంత్రించడం వంటి కీలక పనులు చేస్తాయి. కానీ కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే ప్రారంభ సంకేతాలను మనం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కనుక ఈ సంకేతాలను తొందరగా గుర్తించడం వల్ల కిడ్నీ నష్టాన్ని నివారించవచ్చు. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే 7 హెచ్చరిక లక్షణాలు ఏంటో చూద్దాం..
1. మూత్రంలో మార్పులు
కిడ్నీల పనితీరు సరిగా లేకపోతే మూత్ర విసర్జనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. సాధారణం కంటే ఎక్కువ సార్లు లేదా తక్కువసార్లు మూత్రం రావడం,మూత్రం నురుగు గా లేదా బుడగలతో కనిపించడం,మూత్ర విసర్జనలో నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఈ మార్పులు నిరంతరం ఉంటే, కిడ్నీలు ఒత్తిడికి గురవుతున్న సంకేతమై ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
2. అలసట, బలహీనత
కిడ్నీలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఎరిత్రో పోయెట్ అనే హార్మోన్ విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోతే శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. ఫలితంగా రక్తహీనత (అనీమియా), తరచూ అలసట, బలహీనత అనిపించడం..పని చేయకపోయినా నీరసం, శక్తిలేమి ఉంటుంది. ఈ పరిస్థితి కిడ్నీలు సరిగా పనిచేయక పోవడానికి సూచించే ప్రారంభ హెచ్చరిక సంకేతం కావచ్చు.
3. చేతులు, కాళ్లు, పాదాలు వాపు
కిడ్నీల ప్రధాన పని శరీరంలో ద్రవాలు, ఉప్పును సమతుల్యం చేయడం. కిడ్నీలు సరిగా పని చేయకపోతే ఈ సమతుల్యం కోల్పోతుంది. దీని కారణంగా శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోతాయి, చేతులు, కాళ్లు, పాదాలు వాపు వస్తుంది. కొన్నిసార్లు ముఖం,కూడా ఉబ్బినట్లుగా అనిపించవచ్చు. ఈ వాపు నిరంతరం ఉంటే, అది కిడ్నీలు ఒత్తిడికి గురవుతున్న స్పష్టమైన సంకేతం. వెంటనే నెఫ్రాలజిస్ట్‌ని సంప్రదించడం అవసరం.
4. కళ్ల చుట్టూ ఉబ్బరం
కిడ్నీలు సరిగా పని చేయకపోతే, మూత్రం ద్వారా అధిక ప్రోటీన్ బయటకు వెళ్లిపోవచ్చు. ఇది కిడ్నీ దెబ్బ తినడానికి ఇది ఒక ప్రధాన సంకేతం. ఫలితంగా కళ్ల చుట్టూ తరచుగా ఉబ్బినట్లుగా అనిపించడం, ఉదయం లేవగానే కళ్ల కింద పఫ్‌లా కనిపించడం,శరీరంలో ప్రోటీన్ లోపం రావడం.. ఈ లక్షణం క్రమంగా కనిపిస్తే, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను తొందరగా గుర్తించి చికిత్స పొందవచ్చు.
5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
కిడ్నీ ఒత్తిడికి గురైనప్పుడు లేదా సరిగా పనిచేయనప్పుడు, శరీరంలో ద్రవం సక్రమంగా బయటకు వెళ్లకపోవడం వల్ల అది ఊపిరితిత్తుల్లో పేరుకుపోతుంది. దీని వల్ల విశ్రాంతిలో ఉన్నప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చిన్న పనులు చేసినా ఆయాసంగా అనిపించడం, రక్తహీనత కారణంగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, ఈ లక్షణం నిరంతరంగా ఉంటే, అది కిడ్నీలతో పాటు హృదయానికి సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
6. చర్మం పొడిబారడం, దురద
కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను, అదనపు ఖనిజాలను వడపోసి బయటకు పంపుతాయి. అవి సరిగా పనిచేయకపోతే వ్యర్థాలు రక్తంలో పేరుకుపోవడం జరుగుతుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, నిరంతర దురద, చర్మంపై మచ్చలు, రాష్‌లు కనిపించడం. దీన్ని నార్మల్ గా తీసుకుంటే, కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
7. వెన్ను లేదా పక్కన నొప్పి
కిడ్నీలు వెన్ను కింద భాగంలో, పక్క వైపున ఉంటాయి. అది దెబ్బతిన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్, రాళ్లు (Kidney Stones) ఏర్పడినప్పుడు వెన్ను లేదా పక్క భాగంలో నొప్పి కలుగుతుంది. దీని కారణంగా కడుపు పక్కలలో లేదా వెన్నుపూస కింది భాగంలో తిమ్మిరి/మందమైన నొప్పి, ఒక్కసారిగా ఎక్కువగా వచ్చే తీవ్రమైన నొప్పి (రాళ్లు కదిలినప్పుడు) వల్ల జ్వరం, వాంతులు కూడా జరుగుతాయి. ఈ నొప్పిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ ఇన్ఫెక్షన్, రాళ్లు లేదా అదనపు ఒత్తిడి కారణంగా వెన్ను/పక్క నొప్పి వస్తుంది.
మీ కిడ్నీలు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ పైన చెప్పిన లక్షణాలు గమనించిన వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాలి. సకాలంలో వైద్య సహాయం తీసుకుంటే, కిడ్నీల పనితీరును కాపాడుకోవచ్చు.
