Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!

  • డిగ్రీ ఉంటే చాలు
  • సుప్రీంకోర్టులో ఉద్యోగం పొందే ఛాన్స్
Supreme Court Traffic

Supreme Court Traffic

Supreme Court JCA Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేయాలి. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థికి కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండటంతో పాటు నిమిషానికి కనీసం 35 పదాల కంప్యూటర్ టైపింగ్ వేగం ఉండాలి.

వయోపరిమితి

2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు:

కనీసం: 18 సంవత్సరాలు

గరిష్ఠం: 30 సంవత్సరాలు

రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహించనున్నారు. మొదట ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. అనంతరం కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ అన్ని దశల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపట్టి, ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకం కల్పిస్తారు.

జీతం ఎంత?

సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-6 ప్రకారం జీతం లభిస్తుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.35,400గా ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.