Site icon NTV Telugu

Snapchat Layoff: 10 శాతం ఉద్యోగులను తొలగించనున్న స్నాప్ చాట్…

Layofff

Layofff

ఇటీవల చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభంను తట్టుకోవడానికి తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. అందులో మైక్రో సాఫ్ట్, అమెజాన్, విప్రో, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు సైతం ఉన్నాయి.. ఇప్పుడు మరో కంపెనీ వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది..

ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఇంకా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది.

ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ, వరల్డ్ వైడ్ గా ఉన్న తమ కంపెనీలలోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది.. సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు.గతంలో కూడా ఉద్యోగులను తొలగించింది.. ఇక ఏ విభాగంలో ఎంత మందిని తొలగిస్తుందో మాత్రం తెలియాల్సి ఉంది..

Exit mobile version