NTV Telugu Site icon

NITAP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నిట్ లో భారీగా ఉద్యోగాలు..

Job Vacancy

Job Vacancy

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా నిట్ లో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఉద్యోగాల గురించి వివరంగా తెలుసుకుందాం…

ఖాళీ ఉన్న పోస్టులు..

అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2): 24 పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్‌ మేనేజ్‌మెంట్, సైన్సెస్,మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్..

అర్హతలు..

ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి..

దరఖాస్తు ఫీజు..

రూ.1000. అయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులైతే రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది..

ఎంపిక విధానం..

అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా.

జీతం..

నెలకు.. రూ.70,900.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.10.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023..

దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 20.11.2023.

చిరునామా..

The Registrar, National Institute of

Technology Andhra Pradesh, Kadak

atla, Tadepalligudem – 534101, West Godavari,

Ap- india..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..