NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026: జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారికంగా రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎన్టీఏ పరీక్ష సమయం, విద్యార్థులకు అనుకూలంగా కొన్ని కీలక మార్పులు చేయడంతో ఈసారి నీట్ ఎగ్జామ్ మరింత ప్రత్యేకంగా మారింది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే పూర్తి ప్రాసెస్, పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన గైడ్‌లైన్స్‌లను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
1. ముందుగా అభ్యర్థులు NTA యొక్క అధికారిక NEET వెబ్సైట్ neet.nta.nic.in ను ఓపెన్ చేయండి.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
2. తర్వాత హోమ్‌పేజీలో స్క్రోల్ అవుతున్న “NEET (UG) 2026 Admit Card” అనే అఫీషియల్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. కొత్తగా ఓపెన్ అయిన పేజీలో మీ అప్లికేషన్ నంబర్ (Application Number), డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి.
4. తర్వాత స్క్రీన్‌పై కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయగానే మీ అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లడానికి దీనిని ప్రింటౌట్ తీసి జాగ్రత్త చేసుకోండి.
ఈసారి అదనపు సమయం.. పూర్తి 195 నిమిషాలు!
ఈ సంవత్సరం నీట్ రాస్తున్న విద్యార్థులకు ఎన్టీఏ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎగ్జామ్ టైంను పెంచుతూ NTA కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు (మొత్తం 3 గంటల 15 నిమిషాలు లేదా 195 నిమిషాలు) పాటు జరగనుంది. పరీక్ష సమయం ఎందుకు పెంచారంటే ఎగ్జామ్ సెంటర్లో అటెండెన్స్ షీట్లపై సంతకాలు, బయోమెట్రిక్ లేదా ఇతర వెరిఫికేషన్ ప్రక్రియల సమయంలో విద్యార్థులు కోల్పోయే సమయాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉండే క్లిష్టమైన ప్రాబ్లమ్స్, లెక్కలను సాల్వ్ చేయడానికి (రఫ్ వర్క్ కోసం) ఈసారి ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో అదనంగా ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. హాల్ టికెట్లు రిలీజ్ అయిన నేపథ్యంలో విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ పరీక్షా కేంద్రం (Exam Center) ఎక్కడ పడిందో ముందే చెక్ చేసుకుని, పరీక్ష సన్నాహాలను వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!