సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మంచి జీతాలు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాల కారణంగా హెవీ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 55 పోస్టులు భర్తీకానున్నాయి.
భర్తీకానున్న పోస్టుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరలిస్ట్)30, మేనేజ్‌మెంట్ ట్రైనీ (IT)20, మేనేజ్‌మెంట్ ట్రైనీ (యాక్చురియల్) 05 ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/B.Tech/M.E/M.Tech/MCA/ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, యాక్చురియల్ సైన్స్, ఎకనామిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్‌లో బ్యాచిలర్/మాస్టర్స్/మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు మార్కులు 55 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 జీతం అందిస్తారు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PH అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 200గా నిర్ణయించారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.