Site icon NTV Telugu

Layoff 2024: నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించిన కంపెనీ..

Layofff

Layofff

ఈ మధ్య లేఆఫ్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఆర్థిక కారణాలతో ఇబ్బందులను ఎదుర్కొలేక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. టాప్ కంపెనీలు సైతం ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.. తాజాగా ప్రపంచంలోనే టాప్‌ కంపెనీగా ఉన్న గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ మ్యూజిక్ విభాగం నుంచి 43 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు…

ప్రముఖ ఛానెల్ యూట్యూబ్ మ్యూజిక్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు మెరుగైన జీతం , ఇతర ప్రయోజనాలు అడిగినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కొన్ని మీడియా కథనాల్లో వెలువడింది.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన గూగుల్‌లో, సబ్‌కాంట్రాక్ట్‌గా కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. అయితే ఈ తొలగింపులకు గూగుల్ బాధ్యత వహించదని తెలిపింది. బాధితుల్లో ఒకరైన యూట్యూబ్ డేటా అనలిస్ట్‌ జాక్ బెనెడిక్ట్ గూగుల్‌తో లేఆఫ్స్‌కు సంబంధించి యూనియన్ చర్చలకు పిలుపునిచ్చారు..

ఇదిలా ఉండగా.. తాజాగా జాక్ బెనెడిక్ట్ మాట్లాడుతూ ఉద్యోగులకు తమ తొలగింపుల గురించి ఎలాంటి ముందస్తు నోటీసు రాలేదని చెప్పారు. గూగుల్‌ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందాలు గడువులోపు ముగుశాయన్నారు. తొలగింపులు తమ వ్యాపార కార్యకలాపాల్లో ఒక భాగమని చెప్పారు.. ఇప్పుడు తొలగించిన ఉద్యోగులకు కంపెనీలో ఇతర పోస్టులల్లో ఏడు వారాలు కొనసాగేల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..

Exit mobile version