Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..

Jobs

Jobs

ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అక్కడ ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ (Caregiver) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియ సాగుతోంది.

ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు ఇరువురు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ (GDA, ANM, GNM, B.Sc Nursing) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడటంలో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 1,99,770 (దాదాపు 2 లక్షలు) వేతనం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఉద్యోగ ఒప్పందం రెండేళ్ల పాటు ఉంటుంది.

దరఖాస్తు విధానం…
అభ్యర్థులు ఈ అంతర్జాతీయ అవకాశాన్ని అందుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 2.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు, తమ దరఖాస్తులను skillinternational@apssdc.in అనే ఈమెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది.

విదేశాల్లో సేవలందించాలని భావించే నర్సింగ్ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప వేదిక. కేర్ గివర్‌గా ఇజ్రాయెల్‌లో మంచి జీవన ప్రమాణాలు, భారీ జీతం పొందే అవకాశం ఉండటంతో అర్హులైన వారు వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు స్థానిక ఉపాధి కార్యాలయాన్ని లేదా APSSDC వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.