NTV Telugu Site icon

IBPS Exam Calendar 2025: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్.. ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్

Ibps

Ibps

బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. బ్యాంక్ కొలువుల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పరీక్ష క్యాలెండర్ (IBPS పరీక్ష క్యాలెండర్ 2025)ని విడుదల చేసింది. అన్ని పరీక్షల షెడ్యూల్ ను 2025 పరీక్ష క్యాలెండర్‌లో వెల్లడించింది. వార్షిక పరీక్ష క్యాలెండర్ లో గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే IBPS RRB ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ప్రకటించింది.

ఈ సంవత్సరం IBPS RRB ఆఫీసర్ స్కేల్ I ప్రిలిమ్స్ పరీక్షలు జూలై 27, ఆగస్టు 2, 3వ తేదీలలో నిర్వహించబడతాయి. ఇది కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ), మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటి), స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల నియామకం కోసం రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీలను కూడా క్యాలెండర్‌లో పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగాలు పొందడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ పరీక్ష క్యాలెండర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RRBs-CRP RRBs-XIV (ఆఫీస్ అసిస్టెంట్లు) CRP RRBs-XIV (ఆఫీసర్స్ స్కేల్ I, II & III) PSBPO-III SPL-XV & CRP CSA-XV పరీక్షల తేదీలు:

ప్రిలిమినరీ ఎగ్జామ్స్

ఆఫీసర్ స్కేల్ I: జూలై 27, ఆగస్టు 2, ఆగస్టు 3, 2025
ఆఫీసర్ స్కేల్-II & III: పరీక్ష తేదీలను వెల్లడించలేదు
ఆఫీస్ అసిస్టెంట్: ఆగస్టు 30, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7, 2025

మెయిన్/సింగిల్ ఎగ్జామ్స్

ఆఫీసర్ స్కేల్ I: సెప్టెంబర్ 13, 2025,
ఆఫీసర్ స్కేల్-II & III: సెప్టెంబర్ 13, 2025
ఆఫీస్ అసిస్టెంట్: నవంబర్ 9, 2025

IBPS PSB పరీక్షా తేదీలు

ప్రిలిమ్స్ పరీక్షల

ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ (PO/MT): అక్టోబర్ 4, 5, 11 – 2025
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SPL): నవంబర్ 22, 23 – 2025
కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ (CSA): డిసెంబర్ 6, 7, 13, 14 – 2025

ప్రధాన పరీక్షలు
PO/MT: నవంబర్ 29 – 2025
SPL: జనవరి 4, 2026
CSA: ఫిబ్రవరి 1, 2026

Show comments