IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
- IBPS PO 2026 నోటిఫికేషన్ విడుదల
- 6,715 PO పోస్టులకు వెంటనే అప్లై చేయండి
- డిగ్రీ ఉంటే చాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026-27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్మెంట్ ట్రైనీ (MT-XVI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 ఖాళీల భర్తీకి రిక్రూట్మెంట్ చేపట్టగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా జూలై 21, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: జూలై 1, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 21, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 21, 2026
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
మొత్తం ఖాళీలు
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్మెంట్ ట్రైనీ (MT): 6,715 పోస్టులు
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం అందిస్తారు.
విద్యార్హత
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయో సడలింపు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
దివ్యాంగులకు (PwBD): 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
SC/ST/PwBD అభ్యర్థులు: రూ.175
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ.850
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
1. ప్రిలిమినరీ పరీక్ష
ప్రిలిమ్స్‌లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు.
పరీక్షలో వచ్చే అంశాలు:
ఇంగ్లీష్ లాంగ్వేజ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
రీజనింగ్ ఎబిలిటీ
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికవుతారు.
2. మెయిన్ పరీక్ష
మెయిన్ పరీక్షలో 170 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 160 నిమిషాలు.
3. ఇంటర్వ్యూ
మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు చేసిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్ కాపీని భద్రపరచుకోవడం మంచిది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!