కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఈమేరకు పోస్టల్ లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఇటీవల పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. దానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు..
ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది..స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి సమాచారం కోసం https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు…మే 22 నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 11, 2023 తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులో ఎడిట్ కు జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించనున్నట్లు మొదట అనుకున్నా కూడా ఇప్పుడు డేట్ ను మార్చారు..
కొన్ని కారణాల దృష్టిలో ఉంచుకొని డేట్ ను పొడిగించినట్లు తెలుస్తుంది..వీటిని జూన్ 24 నుంచి జూన్ 26వ తేదీ మధ్య అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేయనున్నారు.. ఇక ఈ ఉద్యోగాల ఫలితాలను వచ్చే నెల మొదటివారంలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు..గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు భారీగా స్పందన లభించింది.. ఇక గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. రెండు లేదా మూడు రోజుల్లో ఐదో జాబితా కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో నోటిఫికేషన్ ను విడుదల చెయ్యడం గమనార్హం.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వారు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
