Site icon NTV Telugu

EPFO Recruitment 2023: నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. రూ. లక్ష జీతం.. పూర్తి వివరాలు ఇవే..

Epfo

Epfo

నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఈ మధ్య వరుస నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈపీఎఫ్‌ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 06లో జాబ్స్ ఉన్నట్లు ప్రకటించింది.. ఎంపికైన అభ్యర్థులకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకూ ఉంటుంది.

ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకొనే వారికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..

ఖాళీలు..

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్‌ఓ దరఖాస్తులు కోరుతోంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి..

నోటిఫికేషన్‌లో ఇచ్చినట్లుగా, ఎంపికైన అభ్యర్థికి పే మ్యాట్రిక్స్‌లోని లెవల్ 06లో నెలవారీ జీతం ఇస్తారు. అంటే నెలకు రూ. 35400 నుంచి రూ. 112400 వరకూ ఉంటుంది. ఇకపోతే అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం అపాయింట్‌మెంట్ కేవలం 2 సంవత్సరాల కాలానికి చెల్లుతుంది..

ఇది ఇలా ఉండగా..ఈపోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం హిందీలో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో ఇంగ్లీషు తప్పనిసరి లేదా ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గానైనా చదివి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్‌ గానైనా చదివి ఉండాలి.. హిందీలో యూనివర్సిటీ సర్టిఫికెట్ ను పోంది ఉండాలి..అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జూలై 13లోపు దరఖాస్తు చేసుకోవాలి… ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version