Site icon NTV Telugu

CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్ లో 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులు మీవే..

Cisf

Cisf

టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

Also Read:Sandeep Kishan : పీపుల్స్ స్టార్ ట్యాగ్ వివాదం పై స్పందించిన సందీప్ కిషన్

ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి టెన్త్ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీబీటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం లభిస్తుంది.

Also Read:Raja Saab: ‘రాజా సాబ్’లో మరింత మసాలా యాడ్ చేస్తున్న మారుతి..!

దరఖాస్తు ఫీజు జనరల్/OBC/EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 5 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..

ఖాళీల వివరాలు

కానిస్టేబుల్ కుక్ – 493
కానిస్టేబుల్ కోబ్లర్ – 9
కానిస్టేబుల్ టైలర్ – 23
కానిస్టేబుల్ బార్బర్ – 199
కానిస్టేబుల్ వాషర్‌మ్యాన్ – 262
కానిస్టేబుల్ స్వీపర్ – 152
కానిస్టేబుల్ పెయింటర్ – 2
కానిస్టేబుల్ కార్పెంటర్ – 9
కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ – 4
కానిస్టేబుల్ గార్డెనర్ –
4 కానిస్టేబుల్ వెల్డర్ – 1
కానిస్టేబుల్ ఛార్జ్‌మ్యాన్ మెకానికల్ – 1
కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ – 2
మొత్తం పోస్టులు – 1161

Exit mobile version