Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
- కెనరా బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగాలు
- వయస్సు, విద్యార్హత, ఎంపిక విధానం ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canara Bank Apprentice Recruitment 2026: బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గోల్డెన్ ఛాన్స్. ఏకంగా 3,500 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఖాళీలకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 17, 2026. నోటిఫికేషన్ వివరాలు.
నెలకు రూ.16,650 స్టైపెండ్
ఎంపికైన Graduate Apprenticesకు నెలకు రూ.16,650 స్టైపెండ్ లభించనుంది. ఇందులో బ్యాంక్, ప్రభుత్వ DBT భాగాలు ఉంటాయని సమాచారం. అప్రెంటిస్‌షిప్ సమయంలో అభ్యర్థులు Canara Bank రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించరు. అందువల్ల సాధారణ బ్యాంక్ ఉద్యోగులకు లభించే ఇతర అలవెన్సులు లేదా ఉద్యోగ ప్రయోజనాలు వర్తించవు.
Also Read
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
- RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
వయస్సు అర్హత
1 సెప్టెంబర్ 2026 నాటికి అభ్యర్థి వయస్సు:
కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 28 సంవత్సరాలు
జనన తేదీ: 2 సెప్టెంబర్ 1998 నుంచి 1 సెప్టెంబర్ 2006 వరకు
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
SC/ST: 5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాలు
PwBD: 10 సంవత్సరాలు
పునర్వివాహం చేసుకోని వితంతువులు/విడాకులు పొందిన మహిళలకు కూడా నిబంధనల ప్రకారం అదనపు వయోపరిమితి సడలింపు ఉండవచ్చు.
విద్యార్హత
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సమానమైన సంస్థ నుంచి ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ 1 జనవరి 2023 నుంచి 1 సెప్టెంబర్ 2026 మధ్య పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ఎంపిక చేసుకునే State/UTకి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. 10వ లేదా 12వ తరగతి మార్కుల మెమోలో ఆ భాష చదివినట్లు ఆధారం ఉంటే ప్రత్యేక భాషా పరీక్ష అవసరం లేకపోవచ్చు. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో స్థానిక భాష పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు Apprenticeship Training పూర్తి చేసినవారు లేదా ఇప్పటికే ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ అప్రెంటిస్‌షిప్‌కు అనర్హులు కావచ్చని నిబంధనలు సూచిస్తున్నాయి. అభ్యర్థి వైద్యపరంగా కూడా ఫిట్‌గా ఉండాలి.
ఒక రాష్ట్రాన్ని మాత్రమే ఎంచుకోవాలి
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఒక State/UTను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉండవచ్చు.
అయితే జిల్లాల కేటాయింపు పూర్తిగా బ్యాంక్ అవసరాలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ Apprentice నియామకంలో ప్రధానంగా మెరిట్ ఆధారిత ఎంపిక ఉంటుంది.
అర్హత పరిశీలన
మెరిట్ లిస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
అవసరమైతే స్థానిక భాష పరీక్ష
మెడికల్ పరీక్ష
ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పిస్తారు.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!