భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా బెల్ నోటిఫికేషన్ విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది..దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bel-india.in సందర్శించి.. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఆగస్టు 26, 2023న సాయంత్రం 5 లోపు అప్లై చేసుకొనేవాళ్ళు చేసుకోవచ్చు..
మొత్తం ఖాళీలు : 57
ట్రైనీ ఇంజనీర్ -I (ఎలక్ట్రానిక్స్) – 8 ఖాళీలు
ట్రైనీ ఇంజనీర్ -I (మెకానికల్) – 28 ఖాళీలు
ప్రాజెక్ట్ ఇంజనీర్ /ఆఫీసర్ – I (ఎలక్ట్రానిక్స్) – 08 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్ / ఆఫీసర్ – I (మెకానికల్) – 08 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్ / ఆఫీసర్ – I (సివిల్) – 01
ప్రాజెక్ట్ ఇంజనీర్ / ఆఫీసర్ – I (HR) – 01
రాజస్థాన్/గుజరాత్‌లోని ప్రాజెక్ట్ సైట్‌ల కోసం 3 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వయస్సు ఉంది.. ఈ ఉద్యోగాలకు వయస్సు 28 ఏళ్ల నుంచి 32 ఏళ్లు ఉండాలి.. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ. 472 అండ్ ట్రైనీ ఇంజనీర్లకు రూ. 177గా నిర్ణయించారు…
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు నెలవారీ జీతం ఇవ్వబడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. bel-india.in వద్ద BEL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి .
*. హోమ్‌పేజీలో కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
*. ఆ తర్వాత దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
*. తదుపరి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
*. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
*. దరఖాస్తు రుసుము చెల్లించండి.
*. దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి..
