NTV Telugu Site icon

BEL Jobs: బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..

Bel Jobs

Bel Jobs

బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బెల్ లో పలు శాఖల్లో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ను అంటే ఇంజనీరింగ్ ను పూర్తి చేసి ఉండాలి..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 205 పోస్టుల ను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2023. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి.. ఇకపోతే ఈ పోస్టుల కు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BE, B.Tech, డిగ్రీని పొంది ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌కు సంబంధించిన మరేదైనా కోర్సు చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి 55 శాతం మార్కులు ఉండటం కూడా అవసరం. వయోపరిమితి విషయానికొస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ I పోస్టుకు వయోపరిమితిని 32 సంవత్సరాలు ఉండాలని అధికారులు తెలిపారు.. జీతం కూడా ఎక్కువగానే ఉండటంతో ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు..

పోస్టుల వివరాలు :

ఇందులో మొత్తం 205 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..191 ఖాళీలు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులు కాగా.. మరో 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ – I పోస్టులు ఉన్నాయి. . వివరాల ను తెలుసుకోవడానికి.. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును…ఈ పోస్టులకు అర్హతలు కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోగలరు.. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది… అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు వెళతారు… ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవడం మంచిది..