Job Notification: ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. తాజాగా బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ II నుంచి స్కేల్ VI (జనరలిస్ట్ ఆఫీసర్) వరకు 350 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సృష్టించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ 10 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 30 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO: CP Radhakrishnan: రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం..
దరఖాస్తు చేసుకోడానికి అర్హత ఏంటి?
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, BE (బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్), BTech (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ), MSc (మాస్టర్ ఆఫ్ సైన్స్) లేదా MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) వంటి డిగ్రీలు చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 25 ఏళ్లు, గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వనున్నారు. జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు రూ.1180, SC / ST అభ్యర్థులకు రూ.118. అభ్యర్థులు ఈ పోస్టుల ఎంపిక కోసం ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష రాయాలి. అందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తయారుచేసిన మెరిట్ జాబితా ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది.
ఎంపిక ఎలా జరుగుతుంది?
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీ లభిస్తుంది. స్కేల్ VI జీతం నెలకు రూ.1,40,500 నుంచి రూ.1,56,500 వరకు, స్కేల్ V జీతం రూ.1,20,940 నుంచి రూ.1,35,020 వరకు, స్కేల్ IV జీతం రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు, స్కేల్ III జీతం రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు మరియు స్కేల్ II జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకు ఉంటుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా ఉంటాయి.
READ ALSO: Snoring Danger: బాబోయ్ ప్రాణాలు తీస్తున్న గురక.. మీకు ఈ అలవాటు ఉందా!
